గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని వివిధ గ్రామాల వాసులకు గత ఇరవై రోజుల నుండి కంటి మీద కునుకు లేకుండా పోయింది. జూన్ నెల వచ్చిన వర్షాలు తగినంతగా లేకపోవడంతో రైతులు ఒకవైపు ఆందోళన చెందుతుంటే మరో వైపు తాము పెంచుకుంటున్న గేదెల కనిపించకుండా పోవడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే రోజుకొక గ్రామంలో గేదెలు కనపించకుండా పోతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో గేదెలను పొలాల్లోకి వదులుతారు. పంటలు లేకపోవడంతో ఒక ఊరి పొలాల నుండి మరొక ఊరి పొలల వరకూ గేదేలు మేస్తూ రాత్రి సమయానికి ఇంటికి చేరుతుంటాయి. అయితే ఇక్కడ మాత్రం గేదెలు తిరిగి రావడం లేదు.
మేడికొండూరు గ్రామంలోని ఒక రైతుకు చెందిన నాలుగు గేదెలు మొదట కనపించకుండా పోయాయి. వీటి కోసం మండలం మొత్తం గాలించినా కనిపించలేదు. అదే విధంగా పాలడుగు గ్రామంలోని రైతుకు చెందిన నాలుగు గేదెలు కనపించలేదు. ఇదంతా దొంగలే చేస్తున్నారని రైతులకు అర్ధమైంది. అయితే ఈ దొంగల ముఠా అత్యంత తెలివిగా రోజుకొక గ్రామం నుండి బర్రెలను దొంగలించడం పనిగా పెట్టుకున్నారు. ఈ ఇరవై రోజుల్లో రూ.15 లక్షలు విలువైన గేదెలు కనిపంచకుండా పోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 16 గేదెలను దొంగలించారు. వీరి ఆట ఎలా కట్టించాలో రైతులకు అర్ధం కాలేదు.
Also read :Crime News: పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేస్తున్నారు.. ఇది దేనికి సంకేతం?
తీగలాగితే డొంక కదిలినట్లు.. కొందరు నిర్మానుష ప్రాంతంలో రెండు గేదెలను కట్టేసి ఉంచడాన్ని మేడికొండూరుకు గ్రామానికి చెందిన రైతులు గుర్తించారు. వాటికి కచ్చితంగా దొంగలే అక్కడ కట్టి ఉంటారని భావించారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో గేదెలను విడపించకుండా అక్కడే మాటు వేశారు. సరిగ్గా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆటోలో దొంగలు అక్కడకి వచ్చారు. గేదెలను ఆటో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో రైతులు ఒక్కసారిగా వారిని పట్టుకున్నారు. ఇద్దరిని బంధించి పోలీసులకు అప్పగించారు. గత ఇరవై రోజులుగా తమ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఆటోల్లో గేదెలు తరలిస్తున్న వారిపై పోలీసులు నిఘా ఉంచాలని సూచించారు.
Also read :Crime: అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..