ఫింగర్ చిప్స్ గురించి విన్నాం కానీ, ఐస్ కీంలో ఫింగర్ గురించి విన్నారా? ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని చల్ల..చల్లగా.. ఐస్‌క్రీం తింటూ ఉండగా, గట్టిగా ఏదో తగిలినట్టైంది. దీంతో పరిశీలనగా చూడగా తెగిన మనిషి వేలు ముక్క కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. చదువుతోంటేనే.. యాక్ అనిపిస్తోంది కదా.. ముంబైలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది.
ముంబైలోని మలాడ్ ప్రాంత నివాసి డా. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ (27) బుధవారం ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అందుకొని ఉత్సాహంగా తింటున్న సమయంలో నాలుకకు ఏదో గట్టిగా తగలడంతో ఏంటా? అని పరికించి చూశారు. అంతే ఒక్కసారిగా వాంతి వచ్చినంత పనైంది. 2 సెంటీమీటర్ల పొడవు ఉన్న మనిషి వేలి ముక్కను చూసి దిగ్భాంతికి లోనయ్యారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు.
తన అనుభవాన్ని బ్రెండన్ ఇలా షేర్ చేశారు. ‘ఉదయం నాసోదరి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది.. దీంతో నేను మూడు బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌లను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే ఐస్‌క్రీం కోను ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది’ అంటూ తెలిపారు.
అయితే నిజంగానే ఇది మనషి ఫింగర్ ముక్కా, లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించ లేదు
https://x.com/snehamordani/status/1801155415641600299?t=ROm2nrgKD7o52MZNF_P0uw&s=19