March 14, 2025
SGSTV NEWS
CrimeTelangana

Crime: 33 ఏళ్ల ఆంటీ.. 22 ఏళ్ల కుర్రాడితో జంప్.. వాడిలో అదే నచ్చిందట!


ఆమెకు పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె మరోకరిపై మనసు పడింది. అతడే కావాలనుకుంది. కట్టుకున్న  భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆమెకు పెళ్లైంది (Married Woman).. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె మరోకరిపై మనసు పడింది. అతడే కావాలనుకుంది. కట్టుకున్న  భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది (Illegal Affair) ఓ వివాహిత. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 2025 ఫిబ్రవరి 05వ తేదీన తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు సుకన్య  భర్త జయరాజ్.  అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

పోలీసులకు విస్తుపోయే నిజాలు
సీసీ కెమెరాల ఆధారంగా సుకన్యను పట్టుకునేందుకు ప్రయత్నించారు.  అక్కడ గోపీ అనే ఓ వ్యక్తి బైక్ ఎక్కి వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. వీరిద్దరని చివరకు మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. అయితే బైక్ ను అక్కడ వదిలేసిన గోపి, సుకన్య రన్నింగ్ బస్సు ఎక్కి వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా దొరకలేదు. ప్రస్తుతం పోలీసులు వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి.

సోషల్ మీడియా (Social Media) లో ఎక్కువగా గడిపే సుకన్యకు గోపీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం  కాస్త ప్రేమగా మారింది. సుకన్యకు గోపీ చూపించే ప్రేమ నచ్చడంతో బాగా దగ్గరైంది. దీంతో ఇద్దరు కలిసి బ్రతకాలని అనుకున్నారు.  ఈ క్రమంలో తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన గోపీతో సుకన్య వెళ్లిపోయింది.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  సుకన్యకు 35 ఏళ్లు కాగా గోపీకి22 ఏళ్లు కావడం గమనార్హం. ఇటీవల భర్త కిడ్నీ అమ్మించి.. ఆ డబ్బుతో ప్రియుడితో వెళ్లిపోయిన భార్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

కాగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో  భర్త కిడ్నీ అమ్మించి.. ఆ డబ్బుతోనే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు మరో వివాహిత భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

Also read

Related posts

Share via