మరి కొన్ని రోజుల్లో వివాహం జరుగనుండగా అంతలోనే విషాదం చోటుచేసుకుంది. ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. అసలు ఏం జరిగిందంటే?
ఏ తల్లిదండ్రులైనా తమ కూతురును ఏ లోటు లేకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటారు. విద్యాబుద్దులు నేర్పించి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పెరిగి పెద్దదైన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటారు. అంగరంగ వైభవంగా వివాహం చేయాలని మురిసిపోతుంటారు. తమ బిడ్డ పిల్లాపాపలతో సుఖసంతోషాలతో అత్తవారింట్లో జీవించాలని కోరుకుంటుంటారు. ఇలాగే తమ కూతురు పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలుగన్నారు. కానీ ఆ పేరెంట్స్ కు ఊహించని షాక్ తగిలింది. మరికొన్ని రోజుల్లో కూతురు వివాహం జరుగనుండగా ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది. మాయదారి డెంగ్యూ జ్వరం వచ్చి ఆమెను కభలించుకుపోయింది.
అందరితో కలివిడిగా ఉండే తమ కూతురు ఒక్కసారిగా వారి నుంచి దూరమైపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. ప్రాణం నీటి మీద బుడగలాంటిది. ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ఊపిరి వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోతారు. ఇదే విధంగా ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి వరప్రద(21) భద్రాచలం సాయి డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది.
ఇటీవల విష జ్వరాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరప్రద గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంది. జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ 3 రోజులపాటు వైద్యం పొందింది. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. కూతురు డెంగ్యూ జ్వరం కారణంగా మరణించడంతో తల్లిదండ్రులు రాజశేఖర్, ఏసుమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న తమ కూతురు ఇలా డెంగ్యూ బారిన పడి తుదిశ్వాస విడవడంతో దిక్కులుపిక్కటిల్లేలా రోదిస్తున్నారు.
21 ఏళ్ల వరప్రద మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా గత కొన్ని రోజుల ముందే వరప్రధకు ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. పెళ్లి చేసుకోవాల్సిన తను డెంగ్యూ జ్వరం తో పోరాడుతూ మృత్యు ఒడిలోకి చేరింది. ఈ విషయం తెలుసుకున్న సాయి డిగ్రీ కళాశాల యాజమాన్యం, స్నేహితులు, గ్రామస్తులు వరప్రద మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమతో ఎంతో ప్రేమగా మాట్లాడే స్నేహితురాలు లేదన్న బాధతో కన్నీటి పర్యంతమయ్యారు
Also read
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం
- డబ్బులిస్తాం.. అంటూ ఇంటికి పిలిచిన దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే..