Calendar: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం 2025లో అధికారిక, ఆప్షనల్ సెలవులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Public Holidays 2025: నూతన సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త ఏడాది సంబరాలకు కొందరు సిద్ధమవుతుంటే..మరికొందరు సంక్రాంతి సంబరాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. 2025లో అధికారిక, ఆప్షనల్ సెలవులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాల అధికారులంతా ఈ సెలవులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
2025 జనవరి 01 బుధవారం వచ్చింది.. ఈరోజు నుంచి సందడి మొదలవుతుంది
జనవరి 2025
2025 జనవరి 13న భోగి పండుగ, 14 న సంక్రాంతి, 14 కనుమ, 16 ముక్కనుమ.. తెలుగువారి అతి పెద్ద పండుగ ఇది.. పండుగ నాలుగు రోజులూ సందడే సండి. అయితే ప్రభుత్వం భోగి 13, 14 సంక్రాంతి రోజు సెలవులు ప్రకటించింది. ఇంకా ఈ నెలలో జనవరి 26 రిపబ్లిక్ డే రోజు సెలవిచ్చింది
ఫిబ్రవరి 2025
ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినం..ఈ రోజు శైవ ఆలయాలు పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోతాయ్
మార్చి 2025
మార్చి 14 హోలీ వచ్చింది.. మార్చి నెలాఖరు ఉగాది, రంజాన్ వరుసగా వచ్చాయ్. మార్చి 30న ఉగాది, 31న రంజాన్ వచ్చింది
ఏప్రిల్ 2025
ఏప్రిల్ 1న కూడా రంజాన్ సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న శ్రీరామ నవమి, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే వచ్చింది
జూన్ – జూలై 2025
జూలై నెలలో తెలంగాణ అతిపెద్ద పండుగల్లో ఒకటైన బోనాలు వస్తుంది. జూన్ 07న బక్రీద్, జూలై 06న మొహర్రం, జూలై 21 బోనాలు వచ్చింది
ఆగష్టు 2025
ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం…ఆ మర్నాడే ఆగష్టు 16 శ్రీ కృష్ణాష్టమి వచ్చింది. ఈ రెండు వరుస హాలిడేస్ వచ్చాయ్. ఇదే నెల చివరివారంలో ఆగష్టు 27న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి
సెప్టెంబర్ 2025
సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ, సెప్టెంబర్ 21 బతుకమ్మ పండుగ ప్రారంభ మవుతుంది. ఆశ్వయుజ మాస అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ తొమ్మిదిరోజుల పాటూ ఘనంగా సాగనుంది.
అక్టోబర్ 2025
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 3 విజయదశమి, అక్టోబర్ 20న దీపావళి వచ్చింది, అక్టోబరు 21 నుంచి కార్తీకమాసం ప్రారంభం…
నవంబర్ & డిసెంబర్ 2025
నవంబర్ నెలలో సగం రోజుల వరకూ కార్తీకమాసం సందడి సాగనుంది. కార్తీకమాసంలో అత్యంత ముఖ్యమైన కార్తీక పౌర్ణమి నవంబర్ 05న వచ్చింది. డిసెంబర్ 25న క్రిస్మస్, డిసెంబర్ 26న బాక్సింగ్ డే
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆప్షనల్ సెలవుల విషయానికొస్తే…
జనవరిలో 14, 15, 28
ఫిబ్రవరిలో 3, 14
మార్చిలో 21, 28
ఏప్రిల్ 10, 14, 30
మే నెలలో 12వ తేదీ
జూన్ లో 15, 27
జూలైలో 5వ తేదీ
ఆగష్టులో 8, 9
సెప్టెంబర్ లో 30వ తేదీ
అక్టోబర్ లో 1, 4, 19
నవంబర్ లో 16వ తేదీ
డిసెంబర్ లో 24వ తేదీ
ఓవరాల్ గా 2025 మొత్తం సాధారణ సెలవులు 27, ఆప్షనల్ హాలిడేస్ 23…మొత్తం 50 రోజులు సెలువులు…
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025