April 19, 2025
SGSTV NEWS
CrimeNational

ఐదుగురిని కిడ్నాప్ చేసి .. ముగ్గురు బాలికలపై 18 మంది అత్యాచరం .. నిందితులందరూ మైనర్లే !


జార్ఖండ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన 18 మంది మైనర్ బాలురులు అందులో ముగ్గురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇందులో మిగిలిన ఇద్దరు బాలికలు వారి నుండి తప్పించుకోగలిగారు.

జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన 18 మంది మైనర్ బాలురులు అందులో ముగ్గురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇందులో మిగిలిన ఇద్దరు బాలికలు వారి నుండి తప్పించుకోగలిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులందరినీ అరెస్టు చేశారు.

ఈ సంఘటన ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం అర్థరాత్రి జరిగిందని ఖుంటి ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. రానియా ప్రాంతంలో ఓ పెళ్లికి వెళ్లిన ఐదుగురు బాలికలు ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కొంతమంది అబ్బాయిలు వారిని ఫాలో అయ్యారు.  నిర్జన ప్రదేశానికి వెళ్లాక అమ్మాయిలందరినీ కిడ్నాప్ చేశారు. వాళ్ళని బలవంతంగా కొండ మీదకు తీసుకెళ్తుండగా.. వారినుంచి ఇద్దరు బాలికలు  తప్పించుకని అక్కడి నుంచి పారిపోయారు.

ముగ్గురు బాలికలపై సామూహిక అత్యాచారం

అనంతరం18 మంది నిందితులు ముగ్గురు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారిని అక్కడే  వదిలేసి పారిపోయారు. అక్కడినుంచి వారు తమ ఇంటికి వెళ్లిపోయారు. ఐదుగురు బాలికలలో ముగ్గురి వయస్సు 12-16 సంవత్సరాలు కాగా, నిందితులైన అబ్బాయిల వయస్సు 12-17 సంవత్సరాల మధ్య ఉంటుందని చెబుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 


బాధిత బాలికల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై భారత శిక్షాస్మృతి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఖుంటి జిల్లాలో ఒక గిరిజన మైనర్ బాలికను ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మాటు వేసిన   ఆరుగురు యువకులు బైక్ పై వెంబడించి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు.

గత మూడేళ్లలో జిల్లాలో మొత్తం 16 గ్యాంగ్ రేప్ కేసులు నమోదయ్యాయి. 2022లో ఏడు, 2023లో ఐదు, 2024లో మూడు, 2025లో ఐదు గ్యాంగ్ రేప్ కేసులు జరిగాయి. ఖుంటి పోలీసులు ఈ కేసులను ఛేదించి, నిందితులపై చర్యలు తీసుకున్నారు, వీరిలో ఎక్కువ మంది మైనర్లు కావడం  గమనార్హం.

Also read






Related posts

Share via