అమీర్ పేట్ : ఎటీఎంలలో పెట్టాల్సిన నగదు భారీగా మాయమైన ఘటన హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఏటీఎంలలో నింపాల్సిన నగదు నుంచి రూ.1.20 కోట్లకు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
సాధారణంగా సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలలో నింపుతుంది. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఎస్సార్‌నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా.. 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.1,20,98,500 నగదు లోటు ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమవుతోంది. వారు విధులకు హాజరు కాకపోవడం.. ఫోన్ కాల్స్క స్పందించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Also read
- గ్యాస్ సిలిండర్‌తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర
- కీసర టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
- 27 ఏళ్ల యువకుడితో 57 ఏళ్ల టీచర్ వివాహేతర సంబంధం
- తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
- బాలికను చంపిన కిరాతకుడికి బుల్లెట్ ట్రీట్మెంట్.. తప్పించుకునే యత్నం.. పోలీసుల కాల్పులు..





