రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు అత్యంత అమాయకుడని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులు..
ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయంపై ప్రమీలమ్మ స్పష్టత ఇచ్చారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఆమె తమ ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుండేదని తెలిపారు. అయితే, ఈ చనువును ఆసరాగా చేసుకుని సాయం పేరుతో ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యేను వేధిస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్లు చేసి, ఇంటికి వచ్చి టార్చర్ పెట్టేదని, దీనివల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె పేర్కొన్నారు.
ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాం..
సదరు మహిళ వేధింపులు మితిమీరిపోవడంతో, తాము గతంలోనే రైల్వేకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రమీలమ్మ వెల్లడించారు. తన కుమారుడికి ఉన్న మంచి పేరును, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఆమె పక్కా ప్రణాళికతో ఈ నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతోనే తాము ఇప్పటివరకు ఓపిక పట్టామని, కానీ ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేను అబాసుపాలు చేసేలా వ్యవహరిస్తోందని అన్నారు.
రాజకీయ కుట్రపై అనుమానం..
ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రతిపక్ష వైసీపీ నాయకుల హస్తం ఉందనే అనుమానాన్ని ప్రమీలమ్మ వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే, ఇలాంటి నీచమైన ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆమె వెనుక ఎవరున్నారో, ఎవరు నడిపిస్తున్నారో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను గ్రహించకుండా తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also read
- సాయం పేరు తో రాత్రి
వేళల్లో టార్చర్ చేసేది.. నా కొడుకు అమాయకుడు, ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఆవేదన.. - జన సేన ఎమ్మెల్యే
రాసలీలల వీడియో లీక్.. పవన్ కు ట్యాగ్ చేస్తూ వైసీపీ సంచలన ట్వీట్.. - వరంగల్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి..
- పట్టువీడని విక్రమార్కుడిలా.. అనుకున్నది సాధించే రాశులివే..!
- Jaya Ekadashi: జయ ఏకాదశి.. ఆరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!





