కడప జిల్లా : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మార్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు…
చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.
అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్ లో మైదుకూరు పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు.
గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కన్పించలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాలు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు
Also read
- Andhra: అచ్చం గీతాగోవిందం మూవీ లాంటి సీన్ – ఈ విద్యార్థిని గురువుకు ఎలా పంగనామాలు పెట్టిందంటే
- Love Couple Suicide : ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి…చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..
- Crime News : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం
- AP Crime: పల్నాడులో రియల్ ఎస్టేట్ మర్డర్.. తండ్రీకొడుకులను నరికి నరికి!
- AP Crime : భార్యను కాపురానికి పంపలేదని అత్తను ఏసేసిన అల్లుడు