SGSTV NEWS online
Andhra Pradesh

ప్రజావసరాల అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తాం ..కొలుసు పార్ధసారధి… Video news

ఏలూరు జిల్లా. ముసునూరు

ప్రజావసరాల అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తాం 
    +ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు రంగ  అభివృద్ధికి కృషి
+రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి
+రూ.4.02కోట్లతో 33/11 కెవి విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన
నూజివీడు:ప్రజావసరాల అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తామని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. ముసునూరు మండలం చింతలవల్లి లో ఆదివారం ఏపి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్  ఆధ్వర్యంలో రూ.4.02 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 కెవి విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేసి, రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చి  రాష్ట్రంలో ప్రజలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి అవసరమైన విద్యుత్ ను చౌకగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.రాష్ట్రంలో విద్యుత్తు రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా  సమగ్ర చర్యలు చేపడుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు రంగంలో సమూల మార్పులు చేసి అభివృద్ధిపథంలోనికి తీసుకువస్తున్నారు న్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన విద్యుత్తు నిరంతరాయ సరఫరా చేయడం మే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్ర‌జ‌లపై భారం లేకుండా డిమాండుకు అనుగుణంగా విద్యుత్తు ఉత్ప‌త్తి పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.  గ్రామాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా  రూ 4.02  కోట్లతో 33/11 కెవి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనలు, రూ 83 లక్షలతో అంతర్గత సీసీ రహదారులకు ప్రారంభోత్సవం చేసుకున్నామని అన్నారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా  ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలకు, వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ను పూర్తిస్థాయిలో అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ మిషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు, కొత్త విద్యత్తు స్తంభాలు, తదితర ఆధునీకరణ పనులు  జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, సాంకేతిక నష్టాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని, పునరుత్పాదక శక్తి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ విద్యుత్తు సరఫరా అందించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని  స్పష్టం చేశారు. విద్యుత్తు ఉపకేంద్రం పూర్తయి వినియోగంలోకి రాగానే దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయని అన్నారు. విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతులను అభినందించారు.


రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో కాలయాపన  చేయవద్దని, పెండింగులో ఉన్న ధరఖాస్తులు వెంటనే మంజూరు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టరు టి.వి.యన్. యస్.మూర్తి, యస్ఇ యు. హనుమయ్య, వివిధ శాఖలు అధికారులు, విద్యుత్తు శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రముఖులు, కూటమి నాయకులు, ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

Also read

Related posts