దొడ్డబళ్లాపురం: కొత్తగా పెళ్లయిన జంటను కారు ప్రమాదంవిచ్ఛిన్నం చేసింది. ఎన్నో కలలతో శ్రీకారం చుట్టిన కొత్త జీవితం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో భార్య, బంధువు దుర్మరణం చెందారు, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా శెట్టిగెరె వద్ద బెంగళూరు-హైదరాబాద్ హైవేలో జరిగింది. రక్షిత రెడ్డి (23), పవన్‌రెడ్డి (30) మృతులు కాగా, రక్షితరెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డాడు.
ఎలా జరిగింది?
రక్షిత, రాజశేఖర్ ఇద్దరూ బెంగళూరులో ఐటీ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరికి గత నవంబర్‌లో వివాహమైంది. ఏపీలోని అనంతపురానికి చెందిన వీరు గురువారం నాడు కారులో బెంగళూరు నుంచి అనంతపురం వెళుతున్నారు. శెట్టిగెరె వద్ద వీరి కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, రక్షిత, బంధువు పవన్ తీవ్ర గాయాలతో దుర్మరణం చెందారు. గాయపడిన రాజశేఖర్‌ని స్థానికులు బెంగళూరుకు తరలించారు. ప్రమాదంతో హైవేపై గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పేరేసంద్ర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also read
- ఎన్టీఆర్ జిల్లాలో విజృంభిస్తున్న వింత వ్యాధి.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్న జనం..!
- హైదరాబాద్ హైవే.. నవ జంట బతుకులో కల్లోలం
- పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
- ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి అమానుషం..!
- గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!





