*ఏడు కోట్ల 70 లక్షల రూపాయలను పవన్ కళ్యాణ్ గారికి  అందించిన వై.వి.బిరాజేంద్రప్రసాద్*. 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 7 కోట్ల 70 లక్షల రూపాయలు విరాళాన్ని అందించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు 
ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు  స్థానిక సంస్థల తరఫున అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వై.వి.బి రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన ఇటీవల అత్యవసరంగా నిర్వహించిన జూమ్ మీటింగ్లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. 
అందులో భాగంగా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు మరియు జడ్పిటిసిల ఒక నెల గౌరవ వేతనం ఏడు కోట్ల 70 లక్షలను రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి నేరుగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేయవలసిందిగా  అంగీకార తీర్మాన పత్రాన్ని అందజేశారు .
 
ఈ కార్యక్రమంలో
గౌరవ ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో
వై వి బి రాజేంద్రప్రసాద్ EX MLC
 రాష్ట్ర అధ్యక్షులు 
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్  
గారి నాయకత్వంలో
1)బిర్రు ప్రతాప్ రెడ్డి 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ 
2)పగడాల రమేష్ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం
3)CJ కొండయ్య 
రాష్ట్ర ఉపాధ్యక్షులు 
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం 
4)లెనిన్ బాబు 
రాష్ట్ర ఉపాధ్యక్షులు 
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం
5)గల్లా తిమోతి 
రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం
6)కల్లూరి శ్రీనివాస్ 
గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు.
7,) రావెళ్ళ సుధాకర్ 
రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం
తదితరులు పాల్గొన్నారు
Also read
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
 - అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 





