ఏపీ ఎన్నికల్లో కొడుకు, కూతురు మధ్య పొలిటికల్ వార్
బస్సు యాత్రలకు ఇద్దరినీ ఆశీర్వదించి పంపిన విజయమ్మ
ఎవరి వైపు నిలబడాలో అర్థంకాక అమెరికా వెళ్లిపోయిన వైనం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి (షర్మిల కొడుకు) వద్దకు ఆమె వెళ్లారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆమె తిరిగిరానని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో కొడుకు జగన్, కూతురు షర్మిల ఢీకొంటున్న సంగతి తెలిసిందే. జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. షర్మిల తీరుపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడుకు, కూతురు ఇద్దరి మధ్య ఆమె నలిగిపోతున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ లో… ఎవరి వైపు నిలబడాలో అర్థం కాక ఆమె మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
జగన్, షర్మిల ఇద్దరిపై విజయమ్మకు ఒక తల్లిగా అంతులేని ప్రేమ ఉంది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సమయంలో ఇడుపులపాయలో ప్రార్థనలు చేసి, జగన్ ను ఆశీర్వదించి పంపారు. అదే విధంగా షర్మిల బస్సు యాత్ర ప్రారంభించిన సమయంలో ఇడుపులపాలో ప్రార్థనలు చేసి, కూతురుని దీవించి పంపారు. ఇప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరికో ప్రత్యేకంగా మద్దతును ప్రకటించలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆమె అమెరికాకు వెళ్లిపోయారు.
Also read
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే..?





