కర్ణాటక: నువ్వు హీరోయిన్లా ఉన్నావు, నిన్ను పెద్ద మోడల్ ని చేస్తాను అని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు, గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్ చేయించాడు. లైంగిక దాడి వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ ఓ యువతి, జిమ్ ట్రైనర్గా పనిచేసే యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుబ్లీ నగరంలో ఇది మతం రంగు పులుముకుని లవ్ జిహాదా రూపాంతరం చెందింది. హిందు సంఘాల నాయకులు నిందితున్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించడం, దీంతో యువతి ఇంటిపై యువకుని కుటుంబీకులు దాడులు చేయడంతో శాంతిభద్రతల సమస్య నెలకొంది.
స్నేహితురాలి సోదరుని జిమ్…
ఈ వ్యవహారం పాత హుబ్లీ ఠాణా పరిధిలో సంచలనం కలిగిస్తోంది. వివరాలు.. కాలేజీలో చదివే బాధిత యువతి (20) స్నేహితురాలి సోదరుడు జిమ్ నడుపుతున్నాడు. స్నేహితురాలి సూచన మేరకు తాను జిమ్ లో మూడేళ్ల కిందట చేరినట్లు యువతి తెలిపింది. ఈ క్రమంలో నిందితుడు సమీర్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమ నాటకం ఆడినట్లుగా బాధితురాలి పేర్కొంది. ఒక రోజు ఇంటికి పిలిపించుకొని మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి లైంగిక దౌర్జన్యం చేశాడు. సదరు దృశ్యాలను మొబైల్లో రికార్డు చేసుకున్నాడు. అంతేగాక ఆ దృశ్యాలను చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తు తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది. తననే కాకుండా ఎందరినో ఇదేరీతిలో మోసగించాడని కూడా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో యువతి బంధువులు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం పట్టలేక సమీర్ ఇంటికి వెళ్లి అతన్ని చితకబాది స్థానిక ఠాణాలో అప్పగించారు.
ఆ ఆరోపణలు అబద్ధం..
సమీర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యువతి, అతడు ప్రేమించుకుంటున్నారని, ఆరోపణలన్నీ అబద్ధమని చెప్పారు. తమపై దాడి జరిగిందని వారు ఫిర్యాదు చేశారు. నగర పోలీసు కమిషనర్ శశికుమార్ స్పందిస్తూ ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయని, విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
హిందూ యువతులు జాగ్రత్తగా ఉండాలని, ప్రేమ పేరుతో లైంగిక సంబం«ధం తల్లిదండ్రులు, పెట్టుకొని మోసగిస్తున్నారని బాధితురాలి ఆమె బంధువులు చెప్పారు. సమీర్ కుటుంబీకులు తమ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడంతో పాటు చంపేస్తామని బెదిరించారని యువతి తండ్రి చెప్పారు. యువతీ యువకుని వీడియోలు వైరల్ అయ్యాయి.
Also read
- 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
- Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?
- సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- ఏపీలో తప్పని డోలీ మోతలు..5 కిలోమీటర్లు, ఏడు వాగులు దాటి ఆసుపత్రికి.. వీడియో వైరల్
- Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..





