November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో మతాల,కులాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు వైసిపి భారీ కుట్ర…!!!

బ్రాహ్మణ జాతిని, సాంప్రదాయాలను అవమానించే వారి పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…*.

అమరావతి:
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ నిర్వహించిన సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత పది సంవత్సరాల నుంచి బ్రాహ్మణ జాతి పై కక్షపూరితంగా కించపరుస్తూ అవమానిస్తూ కొంతమంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విదేశీ సంస్థల కింద పనిచేస్తూ బ్రాహ్మణ జాతిని సనాతన ధర్మాన్ని మంటగలిపే ప్రక్రియ వైసిపి అధిష్టానం ఆధ్వర్యంలో చేపట్టారని వారిలో ముఖ్యంగా కంచె ఐలయ్య హైదారాబాద్, భైరి నరేష్ తెలంగాణ లో, కత్తి పద్మారావు,పొన్నూరు పైలా దాస్ పార్వతీపురం , రామదేవర దాస్ చిత్తూరు, లాంటి వాళ్ళు బ్రాహ్మణ సనాతన ధర్మ వ్యతిరేకులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సభ్య సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకువస్తున్నారని వీరి వెనుక ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వైసిపి పార్టీ, కొన్ని వైష్ణవ పీఠాదిపతులు, విదేశీ సంస్థలు ఉండి బ్రాహ్మణ సమాజాన్ని, స్మార్త ఆగమాన్ని కించపరుస్తూ దేవీ, దేవతలను దూషిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఈ దేశంలో ఒక బ్రాహ్మణ జాతిని నిర్మూలిస్తే సనాతన ధర్మ సాంప్రదాయాలు కనుమరుగు చేయొచ్చనే కుట్రతోనే ఈ వ్యవహారాలన్నీ చేస్తూ పోతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసిన బ్రాహ్మణ జాతిని సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలను భారతదేశంలో నిర్మూలించలేరని అది ఎవరి వల్ల సాధ్యం కాదని ఈ దేశంలో రుజువు అయిందని, గతంలో అనేకమంది విదేశీ, పరమత రాజులు, మేధావులు కవులు, రచయితలు ఎన్నో కుట్రలు చేసిన బ్రాహ్మణ జాతి మనుగడుపు సనాతన ధర్మానికి ఎటువంటి నష్టము కష్టము కలగలేదని భవిష్యత్తులో కూడా కలగదని శ్రీధర్ తెలియజేశారు. గతంలో కంచ ఐలయ్య, కత్తి పద్మారావు వెనుక కమ్యూనిస్టు పార్టీ నేతలు, విదేశీ క్రిస్టియన్,ముస్లిం సంస్థలు బ్రాహ్మణ జాతి నిర్మూలనే ధ్యేయంగా వారికి జీతాలు ఇచ్చి పోషించాయని ఇప్పుడు వైష్ణవ పెట్టుడు పీఠాలు, వాటి పీఠాధిపతులు కలసి పైలాదాస్, రామ దేవరదాస్ తదితర వ్యక్తులను ఎంచుకొని బ్రాహ్మణ జాతిపై, సనాతన ధర్మాలపై సోషల్ మీడియాలలో విషం కక్కిస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో ఇటువంటి వ్యక్తులైన కంచ ఐలయ్య, కత్తి పద్మారావు లాంటి వారిపై తాము పోరాటాలు చేసి వారి నోళ్లు మూయించామని, ఇప్పుడు కొత్తగా మన్యం జిల్లా నుంచి పైల దాస్, చిత్తూరు జిల్లా నుంచి రామదేవరదాస్ లాంటి వ్యక్తులు తయారయ్యారని ఇది ఎంత మాత్రం సభ్య సమాజంలో కరెక్ట్ కాదని, అన్ని కులాలు మతాలు కలిసి మెలిసి జీవిస్తున్న ఈ సమాజంలో బ్రాహ్మణ జాతిని నిర్మూలనే ధ్యేయంగా కొన్ని విదేశీ క్రిస్టియన్, ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో ఈ వైష్ణవ పీఠాల కింద ఈ వ్యక్తులు పనిచేస్తున్నార ని, వాటికి ఎన్నో ఆధారాలు వద్ద ఉన్నాయని.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియన్, ముస్లిం, హిందూ సమాజం మధ్య విభేదాలు సృష్టించేందుకు ఈ పీఠాలు, ఈ వ్యక్తులు విదేశీ ఆర్థిక సంబంధాలతో పని చేస్తున్నారని, కొత్తగా ఎన్నికైన రాష్ట్రల ప్రభుత్వాల మీద ఇలాంటి వివాదాల ద్వారా డిఫెన్స్ లో పడేయడానికి కుట్ర పన్నారని, వీటిపైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. తక్షణమే ఇటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకుని సమాజంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని శ్రీధర్ హెచ్చరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సమాజం మిగిలిన వర్గాలను కలుపుకొని దీని పైన ఎక్కడికక్కడ ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని, చట్టపరంగా పోలీసు కేసులు నమోదు చేయించాలని, బ్రాహ్మణ సమాజం సభ్య సమాజంతో కలిసి సమిష్టిగా ఉద్యమాలు చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చక సేవా సంఘ రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, ఎండపల్లి శబరి, వంగవీటి చైతన్య, చిలుమూరు ఫణి, వడ్డమాను ప్రసాదు తదితర బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.

Also read :ప్రేమికుడు సజీవ దహనం

Related posts

Share via