April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News: పోలీసులపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి



  పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ చినతిరునాళ్లలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం తెల్లవారుజామున బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై మద్యం మత్తులో రాళ్ల దాడి చేశారు.




👉   లక్ష్మీతిరుపతమ్మ తిరునాళ్లలో.. బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురికి గాయాలు

👉    ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో మద్యం మత్తులో దాష్టీకం



ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ చినతిరునాళ్లలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం తెల్లవారుజామున బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై మద్యం మత్తులో రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. మరో ఐదుగురు గాయపడ్డారు. తిరునాళ్లలో కూటమి, వైసీపీ కు చెందిన వారు ట్రాక్టర్లపై ప్రభలు కట్టుకొని తిరుపతమ్మ ఆలయానికి వెళ్లారు. మండలంలోని అనిగండ్లపాడు తిరుపతమ్మ పుట్టింటికి చెందిన వంశీయుల నుంచి ఆలయానికి పసుపు కుంకుమతో బండి వెళుతున్న క్రమంలో పోలీసులు పెనుగంచిప్రోలులో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆ బండి ఆలయానికి వెళ్తుండగా ఇతర ప్రభలను నిలిపివేశారు. ఇందులో భాగంగానే వైసీపీ వారు కట్టిన ప్రభను పోలీస్ స్టేషన్ సెంటర్లో ఆపారు.

తమ ప్రభను ఆలయానికి అనుమతించాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ మద్యం మత్తులో హంగామా సృష్టించారు. బారికేడ్లు దాటుకొని పోలీసులపైకి దూసుకొచ్చారు. నీళ్ల సీసాలు, చెప్పులు, ఇతర వస్తువులు విసిరారు. ఆ తర్వాత ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. అక్కడే విధుల్లో ఉన్న ఏపీఎస్పీ ఆర్ఎస్సై లక్ష్మీనారాయణ కుడి మోచేతికి గాయం కావడంతో మూడు కుట్లు పడ్డాయి. విజయవాడ 3వ ట్రాఫిక్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ మణికంఠకు, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ ఏసోబురాజుకు నుదుటిపై గాయాలయ్యాయి. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లుకు కొన్ని వస్తువులు తగిలాయి. టీడీపి కు చెందిన ఐదుగురు యువకులు గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Also read

Related posts

Share via