బలవంతంగా లొంగదీసుకున్న యువకుడు
సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగిన బాలిక
మూడునెలలుగా చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి
నిందితుడిపై పోక్సో, రేప్ కేసు నమోదు
ధర్మపురి: వావివరుసలు మరిచి ఓ యువకుడు వరసకు చెల్లె
అయిన బాలికపైనే కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి.. శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది.
పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. వరసకు సోదరుడైన కోల మహేశ్ బాలికపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు.
పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక విషమించడంతో పురుగులమందు తాగింది. పరిస్థితి హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన తండ్రి నెల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. బాలిక మరణానికి కారణమైన మహేశ్‌పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Also read
- వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి…
- 27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
- Pitru Dosham: ఇంట్లో అకస్మాత్తుగా సమస్యలా?.. అది మీ పూర్వీకుల శాపం కావచ్చు, వెంటనే ఈ ఆలయాలను దర్శించండి!
- Mystic Truths: గుడి బయట చెప్పులు మాయమయ్యాయా?.. మీకు లక్ష్మీ దేవి ఇచ్చే సంకేతం ఇదే!
- మద్యం మత్తులో హోం గార్డుపై దాడి!





