పరువు హత్యలకు ఆలవాలమైన పొరుగుదేశం పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. విడాకులకు దరఖాస్తు చేసిన మహిళ కాళ్లను ఆమె తండ్రి, మేనమామలు కలిసి నరికేశారు. బాధ్యతలు మరచి తనను చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త నుంచి విడిపోయేందుకు విడాకులు కోరడమే తన తప్పయిందని బాధిత మహిళ సోబియా బతూత్ షా పోలీసులకు తెలిపింది. కరాచీకి చెందిన బాధిత మహిళ తండ్రి సయ్యద్ ముస్తఫా షా,
Also read :Telangana: ఊరు చివర మామిడితోట.. తోటకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో చూస్తే
పరువు హత్యలకు ఆలవాలమైన పొరుగుదేశం పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. విడాకులకు దరఖాస్తు చేసిన మహిళ కాళ్లను ఆమె తండ్రి, మేనమామలు కలిసి నరికేశారు. బాధ్యతలు మరచి తనను చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త నుంచి విడిపోయేందుకు విడాకులు కోరడమే తన తప్పయిందని బాధిత మహిళ సోబియా బతూత్ షా పోలీసులకు తెలిపింది. కరాచీకి చెందిన బాధిత మహిళ తండ్రి సయ్యద్ ముస్తఫా షా, మామలు సయ్యద్ ఖుర్బాన్ షా, ఎహసాన్ షా, షా నవాజ్, ముస్తాక్ షా కలిసి గొడ్డలితో దాడిచేసి పరారైనట్టు సోబియా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె అరుపులు విని వచ్చిన ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో ఉన్న సోబియాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. భర్త తనను నిత్యం వేధించేవాడని, ఇద్దరు పిల్లలను ఏనాడూ పట్టించుకోలేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోలేదని సోబియా వాపోయింది. దీంతో అతడి నుంచి విడిపోవాలనుకున్న ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది ఆమె తండ్రికి, మామలకు కోపాన్ని తెప్పించింది. భర్తపై కోర్టుకెక్కడం ద్వారా కుటుంబానికి చెడ్డపేరు తెస్తోందని భావించిన సోబియా కుటుంబం ఈ పనికి పాల్పడింది.
Also read :ప్రేమ వివాహం.. కానీ భర్త చేసిన పనికి తట్టుకోలేక… దారుణంగా