SGSTV NEWS online
Andhra Pradesh

ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…

*

అమరావతి:
గుంటూరు నగరం కొత్తపేటలో (యడవల్లి వారి సత్రం పక్కన) గత 78 సంవత్సరాలుగా రోగులకు, డాక్టర్లకు సేవలందిస్తున్న నేషనల్ ఎక్సరే,ల్యాబ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం *”ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే”* వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సంస్థలో పని చేస్తున్న సీనియర్ టెక్నీషయన్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఎక్సరే అధినేత బీవీఎస్.కె.విశ్వనాద్,
శ్రీమతి కుసుమ విశ్వనాథ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత విశ్వనాథ్ మాట్లాడుతూ గత 78 సంవత్సరాల నుంచి నేషనల్ ఎక్సరే ల్యాబ్ అనే సంస్థను నగరంలో నడుపుతున్నామని సేవే పరమార్ధంగా, అతి తక్కువ ఫీజులతో తమల్యాబ్ పనిచేస్తుందని. డాక్టర్లు, రోగుల సహకారంతో గత 78 సంవత్సరాల సేవలందించామని, భవిష్యత్తులో కూడా తమ వారసులు ఇలానే సేవలందిస్తారని విశ్వనాథ్ తెలియజేశారు. ఈ వేడుకులను పురస్కరించుకొని ఆయన గత 30 ఏళ్లుగా తమ సంస్థలో సేవలు అందిస్తున్న
యస్. లక్ష్మణ్ కుమార్ కె. రాణి , ఎన్ .రాంబాబులను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి వారికి మెమొంటాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ వెంకటకృష్ణ మాదల, చిలుమూరు ఫణి తదితర సహచర సిబ్బంది పాల్గొన్నారు.

Also Read

Related posts