తెలంగాణలో మరో ఘోరం జరిగింది. జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్‌గా విధులు నిర్వహిస్తున్న నీలిమ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
TG Crime: తెలంగాణలో మరో ఘోరం జరిగింది. జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని– ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. –వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్‌గా విధులు నిర్వహిస్తున్న నీలిమ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది.
అందరితోనూ సరదాగానే..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన నీలిమ 2020 బ్యాచ్. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆమె ఉద్యోగంలో చేరినప్పటినుంచి క్రమశిక్షణగా పనిచేస్తుండేది. అందరితోనూ స్నేహంగా నడుచుకునేంది. అయితే ఆదివారం రోజు తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఇటీవల వరుసగా పెళ్లి సంబంధాలు చూస్తున్న నీలిమకు ఎక్కడా కుదరట్లేదు. దీంతో ఆలసిపోయి కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రయత్నించింది. కానీ ఎవరు ఆమెను చేసుకునేందుకు ఆసక్తి చూపట్లేదని మనస్తాపం చెందింది. దీంతో అవమానంగా భావించిన నీలిమ బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిగా.. కొడకండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025