అడ్డగుట్ట: స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నవ వధువు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిది లో చోటుచేసుకుంది. ఎస్ఐ షాహీద్ పాషా తెలిపిన మేరకు.. లాలాపేటలోని ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన మౌనిక(26)కు నాచారం లోని చిలుకనగర్ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం మౌనిక తండ్రి తన కూతురు, అల్లుడిని ఆర్యనగర్లోని తన ఇంటికి తీసుకొచ్చాడు.
ఆల్లుడు రమేష్ రాత్రి వరకు ఉండి భోజనం చేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మౌనిక స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లి బోర్కు మోటర్ ఆన్ చేసింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురై పెద్ద కేకలు వేసి పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు బాత్రూమ్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా వారికి కూడా షాక్ కొడుతుండడంతో వెంటనే మెయిన్ ఆఫ్ చేసి మౌనికను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోర్ మోటర్కు సంబంధించిన వైర్లు తెగిపోయి ఉన్నాయని, సరిగా టేప్ కూడా వేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్కు గురై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..