June 29, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

సాక్ష్యం చెప్పేందు వస్తే.. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే.. తెల్లారేసరికల్లా షాక్

ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఓ యువకుడు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఆ సంఘటనకు సంబంధించిన సాక్షి కూడా ఫిర్యాదితో పాటు అక్కడికి చేరుకున్నాడు, అతన్ని పోలీసులు రాత్రంతా ఆకలితో, దాహంతో పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.

Also read :Crime news: జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఓ యువకుడు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఆ సంఘటనకు సంబంధించిన సాక్షి కూడా ఫిర్యాదితో పాటు అక్కడికి చేరుకున్నాడు, అతన్ని పోలీసులు రాత్రంతా ఆకలితో, దాహంతో పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. దీని తర్వాత అతను తెల్లవారు జామున మరణించాడు. యువకుడి మృతితో తీవ్ర కలకలం రేగింది. దీంతో వెంటనే మృతదేహాన్ని వైద్య కళాశాల మార్చురీకి తరలించారు. ప్రాథమిక విచారణ తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని, ఒక కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Also read :భర్తకు దూరం.. ప్రియుడు కూడా అలా చేయడంతో

ఎటాహ్‌ నగరంలో దేవేంద్ర, హుస్సేన్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బు లావాదేవీల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో దేవేంద్రుడి ముక్కుపై హుస్సేన్ కొట్టాడు. దీంతో దేవేంద్ర 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు నిందితుడు హుస్సేన్‌తో పాటు దేవేంద్ర, దేవేంద్ర స్నేహితుడు రాకేష్‌లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు రాకేష్ ప్రత్యక్ష సాక్షి. ఫిర్యాదిదారులు దేవేంద్ర, రాకేష్‌లను రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. దీంతో రాత్రంతా కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా నిర్బంధించారు. దీంతో తెల్లవారు జామున రాకేష్ ప్రాణాలు విడిచాడు.

దల్సాపూర్ గ్రామంలో హుస్సేన్ అలీ, దేవేంద్రల మధ్య ఐదు వేల రూపాయల లావాదేవీకి సంబంధించి నిన్న గొడవ జరిగిందని ఎస్‌ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దేవేంద్ర హుస్సేన్‌ను రూ. 5000 అడగగా, అతడు అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ విషయాన్ని దేవేంద్ర పోలీసులకు తెలియజేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాక్షి రాకేష్‌తో పాటు అందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దేవేంద్ర వైద్యం కూడా పోలీస్ స్టేషన్ లోనే జరిగింది. రాత్రి కావడంతో ఊరి నుంచి ఎవరూ రాకపోవడంతో ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అందుకే పోలీస్ స్టేషన్ లోనే పడుకున్నాడు. తెల్లవారుజామున రాకేష్‌కు కళ్లు తిరగడంతో వెంటనే నిధౌలీ చక్‌కి తీసుకెళ్లామన్నారు. అక్కడ నుంచి రెఫర్ చేయడంతో తీసుకువెళ్తుండగా చనిపోయాడని ఎస్‌ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో మాకు భోజనం పెట్టలేదని దేవేంద్ర చెబుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నామని, ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామన్నారు. దోషులుగా తేలితే వారిపై చర్యలు తీసుకుంటారు.

Also read :Murder : తాగొచ్చి వేధిస్తుండని భర్తను చంపిన భార్య

Related posts

Share via