July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

వల్లభనేని బాలసౌరి, కొల్లు రవీంద్ర ల గెలుపుతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది….

*మచిలీపట్నం*
*05/05/2024*

*

*ప్రజా ఆమోదయోగ్యంగా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో…. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్….*

*ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ లోని 83వ ఓటర్ బూతు లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రవేశ పెట్టే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ఎన్డీఏ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఎన్నికల గుర్తు గ్లాసు గుర్తుకు ఆరో నెంబరు, ఎన్డీఏ కూటమి మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎన్నికల గుర్తు సైకిల్ కు రెండో నెంబర్ గుర్తు లకు ఓటు వేయాలని క్యాండిడేట్స్ ఎన్నికల నమోదు ఓటరు ప్యాడ్ ల నమూనాతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ఆదివారం పంపిణీ చేయడం జరిగింది….*

*ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్ మీడియాతో మాట్లాడుతూ…*

ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు.

ప్రజా ఆమోదయోగ్యంగా కూటమి మేనిఫెస్టో ఉంది అన్నారు. కూటమి మేనిఫెస్టో తో అన్ని వర్గాలకు మేలు జరిగి పరిశ్రమలు, అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ లను అభివృద్ధి చేస్తారు అన్నారు.

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అని అన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎంతో సుదీర్ఘంగా ప్రజలందరితో ఆలోచన చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేశారు అన్నారు.

రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించి, ప్రజల అవసరాలను తీర్చడమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల లక్ష్యంతో పాటు ఎన్డీఏ కూటమి పోటీలో ఉన్న అభ్యర్థుల లక్ష్యం అన్నారు.

చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తుంటే,ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ప్రజా ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలే చెబుతున్నారు అన్నారు.

ప్రజల వద్దకు వెళుతుంటే వైసీపీ పాలనలో పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నుల పెంపుదల, చెత్త పై పన్ను భారం ఇలాంటి బాదుళ్లతో వైసిపి పాలకులు సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ప్రజలు వారి బాధను వ్యక్తం చేస్తూ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం మా బాధ్యత అని ప్రజలు అంటున్నారు అన్నారు.

మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా మచిలీపట్నం పార్లమెంట్ ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి, వల్లభనేని బాల సౌరిని, మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, కొల్లు రవీంద్ర లను కచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గంజాల రవికుమార్, కొల్లేరు సత్యనారాయణ, బత్తిన  అగస్తేశ్వర రావు, కేదరాశి నాగేశ్వరరావు, జి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via