జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపదలకు, విలాసాలకు అధిపతిగా భావిస్తారు. అదే సమయంలో సూర్యుడిని ఉద్యోగానికి, ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కదలికలతో అన్ని రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది. జనవరి నెలలో శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రాదిత్య రాజ యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
జనవరిలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. ఎప్పటినుంచో నిలిచిపోయిన నిధులు తిరిగి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలకు లాభాలు వస్తాయి. సృజనాత్మకత మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధాలలో సమతుల్యత వస్తుంది. మనశ్శాంతిని పొందుతారు.
మీనరాశి
శుక్రాదిత్య రాజయోగం మీనరాశి జాతకులకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ రాజయోగం మీ రాశిలో 11వ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల ఈ సమయంలో మీరు ఆదాయంలో గణనీయమైన మార్పులను చూస్తారు కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆస్తి సంబంధిత విషయాలలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవని నిరూపించబడతాయి. పెట్టిన పెట్టుబడుల నుండి రాబడి వస్తుంది. మీన రాశి వారి కోరికలు నెరవేరుతాయి.
తులారాశి
శుక్రాదిత్య రాజయోగం తులా రాశి వారికి అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. తులా రాశిలో నాలుగవ ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడడం వల్ల తులారాశి జాతకులు విలాసాలను పొందుతారు. వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారాలలో కొత్త విజయాలను సానుకూల మార్పులను చూస్తారు. తులా రాశి వారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీకు తల్లితో సంబంధం బాగుంటుంది
Also Read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





