మండ్య: ఓ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన కొడగు జిల్లా విరాజపేటె సమీపంలోని బేటోళి గ్రామంలో జరిగింది. బేటోళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు శిల్పా సీతమ్మ (40) అనే మహిళను ఆమె భర్త సి. నాయకండ బోపణ్ణ తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య చాలా రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి శిల్పా వేరొకరితో ఫోన్ లో మాట్లాడుతుండగా, బోపణ్ణ అడ్డు చెప్పాడు. ఈ విషయమై గొడవ జరగడంతో కసితో రగిలిపోయిన బోపణ్ణ శనివారం ఉదయం ఇంట్లోని సింగిల్ బ్యారెల్ తుపాకీతో భార్య శిల్పాపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది. శిల్పా సీతమ్మ 2012 నుంచి 2017 వరకు బేటోళి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పనిచేశారు. జిల్లా ఎస్పీ కే. రామరాజన్, విరాజపేటె గ్రామీణ పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించి నిందితున్ని అరెస్టు చేశారు. కొడగు జిల్లాలో ఇళ్లలో తుపాకులు ఉంచుకోవడం సాధారణం. దీని వల్ల అప్పడప్పుడు తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతూ ఉంటాయి.
Also read :ముప్పిరెడ్డిగారి పల్లెలో దారుణం….బాలికపై అత్యాచారం
Telangana: వనజీవులను ముప్పు తిప్పలు పెట్టే నక్కలు ఆపదలో పడ్డాయి.. ఏం జరిగిందంటే..?
బంక్ ఓనర్.. ప్లాంట్ ఓనర్.. ఒక్కరే.. ఇది మామూలు దందా కాదుగా.. గుజరాత్ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించి..
ఆంధ్ర ప్రదేశ్ : బయటేమో ఇలా.. లోపలేమో అలా.. యవ్వారం మామూలుగా లేదుగా.. అమ్మాయిలతో..