April 19, 2025
SGSTV NEWS
Andhra Pradesh

Visakhapatanam: సెక్యూరిటీ ఎందుకు స్వామీ?

సంసారం వదిలేసి సన్యాసి జీవితం గడిపేవారికి సైతం నాడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది.

శారదా పీఠాధిపతికి ఇద్దరు గన్‌మెన్లు.. ఉత్తరాధికారికి కూడా

పీఠం వద్ద పోలీసులతో బందోబస్తు.. జగన్‌ హయాంలో ఏర్పాటు

వారికి భద్రత అవసరమా?.. దృష్టి సారించిన కొత్త ప్రభుత్వం

సంసారం వదిలేసి సన్యాసి జీవితం గడిపేవారికి సైతం నాడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోని శారదా పీఠం నిర్వాహకులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతికి చెరో ఇద్దరు గన్‌మెన్లను ఇచ్చింది. రాష్ట్రంలో ఏ స్వామికీ లేని సెక్యూరిటీ వీరికి ఎందుకు అంటూ కొందరు…టీడీపీ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ఎంతమంది పీఠంలో పనిచేస్తున్నారు….వారికి ఎంత వ్యయం అవుతున్నదో వివరాలు పంపాల్సిందిగా కోరినట్టు తెలిసింది.

త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. జగన్‌ హయాంలో చినముషిడివాడలోని శారదా పీఠం వద్ద ఒక ఏఎ్‌సఐ, నలుగురు కానిస్టేబుళ్లును బందోబస్తు కోసం ఏర్పాటుచేశారు. ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సాములోరికి భద్రత కల్పిస్తున్నారు. అంతకుముందు లేదు. జగన్‌ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చీఫ్‌ సెక్రటరీలు, సెక్రటరీలు, కమిషనర్లు, ఎస్పీలు….ఇలా అనేక మంది …. స్వాములను దర్శించుకొని కోర్కెల చిట్టా విప్పి సిఫారసులు చేయించుకునేవారు.

Also read :

స్వరూపానంద స్వామి జగన్ ప్రభుత్వ మద్దతుతో కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం వెంటనే స్వాదీనం చేసుకోవాలి….!!!

ఈ బుగ్గ కార్ల వెంబడి వచ్చే వైసీపీ నాయకులు, కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసు బందోబస్తు ఇచ్చారు. గతంలో ఈ స్వాములు తిరుపతి, హరిద్వార్‌, కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు రైలులో వెళ్లేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక విమానాల్లో రాకపోకలు చేస్తున్నారు. అందులో వీరు తప్ప ఇంకెవరూ ఉండరు. విశాఖ విమానాశ్రయంలో కూడా వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వీరు ప్రయాణికులందరితో పాటు వెళ్లి చెకిన్‌ చేసుకోరు. ముందుగానే ఆ ఏర్పాట్లు జరిగిపోతాయి. స్వాములు రాగానే సెక్యూరిటీ సిబ్బంది తలుపులు బార్లా తెరిచి పట్టుకుంటే…భుజాన కర్ర వేసుకొని, పంచెను సర్దుకుంటూ నేరుగా వెళ్లిపోతారు. ఇప్పుడు ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి.

Also read :పోలీస్ కస్టడీలో నాపై హత్యాయత్నం.. గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు

Related posts

Share via