హైదరాబాద్: మద్యం మత్తులో సిగరెట్ తాగుతుండగా.. సోఫాకు నిప్పంటుకుని విశ్రాంత సైనిక ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన బోరబండ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సెక్టార్ ఎస్ఐ కాశయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నకేశవులు (67) విశ్రాంతి సైనికోద్యోగి. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హెచ్ఎఫ్ నగర్ ఫేజ్-1 బస్తీలో నివాసముంటున్నాడు. ఆయనకు మద్యం, పొగ తాగే అలవాటు ఉంది.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్న కేశవులు భవనం పైగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆయన ఉన్న గది నుంచి మంటలు రావడంతో భార్య, స్థానికులు వెళ్లి చూడగా.. సోఫాలోనే పూర్తిగా కాలిపోయి ఉన్నాడు. చెన్నకేశవులు మద్యం మత్తులో సిగరెట్ తాగుతున్న క్రమంలో సోఫాకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగి కాలిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- హర హర మహాదేవ్.. చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం.. ఏపీలో ఎక్కడ ఉందంటే..
- ఫిట్స్ వచ్చిన బైకర్‌కు సాయం చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే..
- ఎంతకు తెగించార్రా.. తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు.. కారణం తెలిస్తే..
- ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..





