November 21, 2024
SGSTV NEWS
Spiritual

దీపావళి రోజు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి? – ఈ విషయాలు మీకు తెలుసా?

దీపావళి రోజు దీపం ఎలా వెలిగించాలి? -ఏ ప్రమిదలో దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం?


జీవితంలో నెలకొన్న చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండగగా దీపావళిని జరుపుకొంటారు. నరకాసురుడనే రాక్షసుడు అంతమై పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ పండగ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది. అయితే, చాలా మంది దీపావళిరోజు పూజా మందిరంలో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తుంటారు. ఇంటి ముందు భాగంలో మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తుంటారు. అయితే శాస్త్ర ప్రకారం.. ఒక్కొ ప్రమిదలో ఒక్కో దీపం వెలిగిస్తే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు  చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ ప్రమిదలో వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.బంగారు ప్రమిద: బంగారు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందని, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తారని వివరిస్తున్నారు. అలాగే ధన లాభం ఉంటుందని, బంగారం కొనుగోలు చేసే శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇవన్నీ జరగాలంటే చిన్న సైజు బంగారు ప్రమిదలో సన్నటి వత్తితో దీపం పెడితే సరిపోతుందని అంటున్నారు.వెండి ప్రమిద:దీపావళి రోజు పూజా మందిరంలో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఇంటి యజమానికి అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుందని తెలుపుతున్నారు.రాగి ప్రమిద: దీపావళి రోజు ఇంటి ముందు రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే మనోధైర్యం పెరుగుతుందని  వివరిస్తున్నారు.
కంచు ప్రమిద: ఈ రోజుల్లో చాలా మంది డబ్బు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుందని బాధపడుతుంటారు. ఇలాంటి వారు కంచు ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఇంటి ముందు దీపం వెలిగిస్తే ధనానికి స్థిరత్వం ఉంటుందని చెబుతున్నారు.మట్టి ప్రమిద

సహజంగా దీపావళి రోజు ఇంటి ముందు భాగంలో అందరూ మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తుంటారు. ఇలా మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని వివరిస్తున్నారు. నర దోషం, నర పీడ, దృష్టి దోషం నుంచి బయట పడవచ్చని  జ్యోతిష్య నిపుణులు  తెలుపుతున్నారు.

Related posts

Share via