February 24, 2025
SGSTV NEWS
CrimeNational

ఏం మనుషులు రా మీరు…తమ ముందు బుల్లెట్‌ బండి నడిపాడని రెండు చేతులు నరికేశారు!


ఓ దళిత యువకుడు తమ ముందు బుల్లెట్‌ బండి నడిపాడని అతని రెండుచేతులూ నరికేశారు కొంతమంది అగ్రవర్ణాలవారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
.ఓ దళిత యువకుడు తమ ముందు బుల్లెట్‌ బండి నడిపాడని అతని రెండుచేతులూ నరికేశారు కొంతమంది అగ్రవర్ణాలవారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  నిందితులను వినోద్, ఆది ఈశ్వరన్, వల్లరసుగా గుర్తించారు.  వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 294(b), 126, 118(1), 351(3) సహా పలు సెక్షన్ల కింద సిప్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న అయ్యసామి అనే బాధితుడు బుధవారం తన మామ భూమినాథన్ కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా అతడిని ముగ్గురు అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారు. కులం తక్కువోడివి మా ముందే బండెక్కుతావా?.. నీకు బుల్లెట్‌ కావాల్సివచ్చిందా  అంటూ అతనిపై దాడి చేసి రెండు చేతులూ నరికేశారు.  దాడిని చూసిన గ్రామస్తులు వెంటనే అతన్ని మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు.  అతడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. అయ్యసామి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లిన టైమ్ లోనే దాడిచేసిన దుండగులు అతడి ఇంట్లోకి వెళ్లి వస్తువులను కూడా ధ్వంసం చేశారు. గ్రామంలో చాలా కాలంగా కుల వివక్షత ప్రబలంగా ఉందని, తమ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని అయ్యసామి కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనే
గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  డిసెంబర్ 2024లో కారు డోర్ పై రాతలు రాసాడని ఆరోపిస్తూ తొమ్మిదేళ్ల దళిత బాలుడిపై దారుణంగా దాడి చేశారు. జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులను ఈ ఘర్షణలో కత్తితో పొడిచారు.  26 ఏళ్ల మోహన్‌గా గుర్తించబడిన నిందితుడిని అరెస్టు చేశారు. నాల్గవ తరగతి విద్యార్థి అయిన బాలుడిని మోహన్ ఆపి అతని ఇంటి లోపలికి లాక్కెళ్లి, మరో ఇద్దరు అబ్బాయిలతో పాటు తీవ్రంగా కొట్టాడు మోహన్. 

Also read





Related posts

Share via