July 3, 2024
SGSTV NEWS
Spiritual

హోలీ పౌర్ణమి 2024: హోలీ పౌర్ణమి విశిష్టత ఏంటి? లక్ష్మీదేవి ఆరాధనకు ఎందుకంత ప్రాముఖ్యత

హోలీ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఆరోజు లక్ష్మీదేవి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి..నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు, విప్రతేజం బ్రహ్మశ్రీగురు రాంభట్ల. రవిసోమయాజి, వివరించారు.



ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, లక్షీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, వసంతోత్సవాలు వంటివి చేసుకోవడం చాలా పుణ్యప్రదమని చిలకమర్తి తెలిపారు. పౌర్ణమిని అత్యంత అదృష్టవంతమైన రోజుగా పరిగణిస్తారు. అందులో ఫాల్గుణ పౌర్ణమి మరింత విశిష్టత సంతరించుకుంటుంది. ఈ సంవత్సరం మార్చి 25న ఫాల్గుణ పౌర్ణమి వచ్చింది. మార్చి 24 ఉదయం 09. 54కు పౌర్ణమి తిథి ప్రారంభమై, 25 మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుందని నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు, విప్రతేజం బ్రహ్మశ్రీగురు రాంభట్ల. రవిసోమయాజి, వివరించారు

ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరి నెల. అందువల్ల ఫాల్గుణ పూర్ణిమ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. హైందవంలో ముఖ్యమైన పర్వదినంగా భావించే వసంతోత్సవం ఈరోజునే జరుపుకుంటారు. ఈరోజు వసంత రుతువు రాకను సూచిస్తుంది. ఈ రోజున చంద్రుడు శక్తివంతంగా ఉంటాడని చిలకమర్తి తెలిపారు. ఈ సంవత్సరంలో ఇది చివరి పౌర్ణమి. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉండి, చంద్రుడిని, శ్రీహరిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే అనేక దోషాల నుండి విముక్తి పొందుతారని శాస్త్ర వచనం.

ఫాల్గుణ పౌర్ణమి రోజును లక్షీ ఆవిర్భావ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అందువల్ల ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున నరసింహస్వామిని కూడా విశేషంగా పూజిస్తారు. ఈరోజున ఉదయమే నిద్ర లేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి విష్ణువును పూజించాలి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి. చంద్రుడు ఉదయించిన తరవాత ఉపవాసం విరమించాలి. ఈ రోజు సానుకూలమైన ఆలోచనలు చేయాలి. ఎవరి మనోభావాలను గాయపరచకుండా చూసుకోవాలి. విష్ణు ప్రీతికరమైన ఫాల్గుణంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి, పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకంలో నాగదోషం ఉంటే ఈ రోజు హోమాలు జరిపిస్తే తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు, విప్రతేజం బ్రహ్మశ్రీగురు రాంభట్ల. రవిసోమయాజి, తెలిపారు

Also read

Related posts

Share via