June 25, 2024
SGSTV NEWS
Spiritual

Spirituality: మడి వంట అంటే ఏంటి… ఇది పాటించకపోతే ఏమవుతుంది..!

హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఆచారం మడి కట్టుకోవటం. అదేంటో తెలియక అది ఓ చాదస్తం అనేస్తారు కానీ అది ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన విషయం అని ఎంతమందికి

పాటించాల్సిన అచారాలు వదిలివేయకూడదు, అనవసరమైనవి పాటించకూడదంటారు ‘ఆచార హీనం నపునంతి వేదాః’ అంటే ఆచార హీనుడిని వేదాలు కూడా పవిత్రుడిని చేయలేవని అర్ధం. మడి అంటే చాదస్తం కాదు శారీరక శౌచం( శుభ్రత). పూజ లేదా వంట చేసేటప్పుడు మడి కట్టుకుంటారు. అంటే మనసు దైవం పట్ల తప్ప అన్య విషయాల వైపు పోనివ్వకూడదని అర్థం. వంట విషయంలోనూ అంతే.  వంట చేసేవారు ఎంత శ్రద్ధగా, ప్రశాంతంగా చేస్తారో ఆ ఆహారం తిన్నవారిలో అంత పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. వంట చేసే సమయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తామో, ఏ దృశ్యాలు చూస్తామో ఆ ప్రభావం తినేవారిపై ఉంటుందని చెబుతారు. అందుకే ఆహారం సిద్ధంచేసే సమయంలో మడికట్టుకోవడం  ( మనస్సు మొత్తం వంటపైనే లగ్నం చేయడం) అనే పదాన్ని వాడతారు. వంట చేసేవారు చికాకు, బాధ, కుంగుబాటు, కోపానికి లోనైతే ఆ భోజనం చేసేవారి మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. ఆ ఆహారం విషంగా మారుతుంది. మడిలో ప్రధాన అంశం కూడా ఇదే. దేన్నీ ముట్టుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, భగవంతుని ధ్యానిస్తూ వంట చేయాలి.

నిత్యం వంట చేసిన తర్వాత నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్పడం వెనుక కారణం కూడా ఇదే. రోజూ చేసే వంటకి, దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు చేసే వంటకి తేడా ఉంటుంది. నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు శుచిగా స్నానం చేసి, భక్తి-శ్రద్ధతో వంట చేసి నివేదిస్తాం. ఆ రోజు ఆ ఇంట భోజనం చేసిన వారంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడే మరో క్లారిటీ ఏంటంటే ఏదైనా పండుగ రోజు ఇంట్లో వాతావరణం, ఆ రోజు తిన్న భోజనానికి…మిగిలిన రోజుల్లో వాతావరణం-ఆ రోజుల్లో భోజనానికి వ్యత్యాసం గమనిస్తే మీకే అర్థమవుతుంది. దేవుడికి నివేదించిన ఆహారంలో దైవత్వం, దివ్యత్వం నిండి ఉంటుంది. అది తిన్నవారి మనస్సులోకి  దివ్యత్వం ప్రవేశిస్తుంది…అలాంటి వారి ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయంటారు పెద్దలు. అందుకే ఉతికి ఆరవేసిన శుభ్రమైన వస్త్రాలు ధరించి , ముఖాన బొట్టు పెట్టుకుని, జుట్టు ముడివేసుకుని వంట చేయాలని చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే  మడి అంటే మానసిక ప్రశాంతంత, దైవత్వం నిండిన ఆలోచన, ధ్యాసను మొత్తం ఒక దగ్గరే కేంద్రీకరించడం అంటారు పెద్దలు.

Related posts

Share via