March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad Crime: వెబ్‌ సిరీస్‌, యూట్యూబ్‌ చూసి ఇద్దరిని చంపేశాడు!


జవహర్‌నగర్‌, లాలాగూడలో తల్లీకూతుళ్ల హత్యల కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడు. యూపీకి చెందిన అరవింద్‌ అలియాస్‌ అరుణ్‌ వీరిని హత్య చేశాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం యూట్యూబ్‌,వెబ్‌ సిరీస్‌ లు చూసినట్లు పోలీసులకు తెలిపాడు

జవహర్‌నగర్‌, లాలాగూడలో తల్లీకూతుళ్ల హత్యల కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడు. యూపీకి చెందిన అరవింద్‌ కుమార్‌ అలియాస్‌ అరుణ్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రైలులో పారిపోతుండగా పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. లాలాగూడకు చెందిన ఉడుగల సుశీల కు నలుగురు పిల్లలు. జ్ఙానేశ్వరి,లక్ష్మి ఉమామహేశ్వరి,శివ.కుమారుడు పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటున్నాడు.

పెద్దకుమార్తె జ్ఙానేశ్వరికి వివాహం చేయాలని తల్లి ప్రయత్నించినా ఆమె ఒప్పుకొలేదు. సుశీల భర్త మరణాంతరం రెండో కూతురు లక్ష్మికి కారుణ్య నియామకం కింద రైల్వేలో ఉద్యోగం వచ్చింది. సుశీల కుటుంబం లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌ లో ఉన్నప్పుడు యూపీకి చెందిన మేస్త్రీ అరవింంద్‌ కుమార్‌ అలియాస్‌ అరుణ్‌ ఓ పరిచయం ఏర్పడింది. అప్పటికే అరవింద్‌ కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈ క్రమంలో అరవింద్‌ కి,లక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది.తర్వాత సుశీల,ఉమామహేశ్వరి జవహర్‌నగర్‌ లోని కౌకూరులోని ఇంట్లో ఉంటున్నారు. రైల్వే క్వార్టర్స్‌ లో జ్ఙానేశ్వరి, లక్ష్మి మాత్రమే ఉండేవారు. ఇంట్లో జ్ఙానేశ్వరి ఉండగానే అరవింద్‌ ఇంటికి వస్తుండడంతో అక్కకి చెల్లికి గొడవలు జరిగేవి.

పెళ్లి చేసుకుంటానని చెప్పగా…జ్ఙానేశ్వరి వద్దని చెప్పేది. దీంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. హత్య చేసి ఎలా తప్పించుకోవాలో అరవింద్‌ వెబ్‌ సిరీస్‌ లు,యూట్యూబ్‌ చూశాడు. మార్చి 1 న జ్ఙానేశ్వరి తల పై బలంగా కొట్టాడు. ఆమె స్పఙహ తప్పి రెండ్రోజులు ఇంట్లోనే ఉంది. మరణించినట్లు ధ్రువీకరించుకున్న నిందితులు మార్చి 3న బస్తాలో మూటగట్టి సమీపంలో ఖాళీగా ఉన్న రైల్వే క్వార్టర్‌ లోని సంపులో విసిరేశారు.

త్వాత సుశీలను జవహర్‌ నగర్‌ పరిధి కౌకూరులోని నివాసంలో హత్య చేశాడు. దోపిడీ దొంగలు చేసినట్లుగా చిత్రీకరించేందుకు అరవింద్‌ బంగారాన్ని ఎత్తుకుపోయాడు.లక్ష్మి అరవింద్‌ తో తరచూ ఫోన్‌ మాట్లాడుతున్నట్లు విచారణలో తెలిసింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జంట హత్యల కేసు బయటపడింది.

Related posts

Share via