July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!



హైదరాబాద్,  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి  వచ్చేదాకా ఫోన్లు ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ పోలీస్ అధికారి ప్రణీతరావు వాంగ్మూలం ఇచ్చాడు. మొత్తం 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించాడు. వాంగ్మూలం నివేదిక దర్యాప్తు అధికారులు బయటకు విడుదల చేయగా.. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు.. ఇలా మొత్తం 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు చెప్పాడు. వీళ్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం టాప్ చేసినట్లు పేర్కొన్నాడు.

ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టం ద్వారా ట్యాపింగ్కు పాల్పడ్డాం. రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ కొనసాగించాం. ఎనిమిది ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉన్నా. అధికారికంగా మూడు ఫోన్లు వినియోగించా. అనధికారికంగా ఐదు

ఫోన్లతో ఎప్పటికప్పుడు ట్యాపింగ్ను మానిటరింగ్ చేశాం. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నాం. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించాం.

ఇక.. ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నాం. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ లో సహాయంతో టాపింగ్ ని విస్తృతంగా చేసాం. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాపింగ్ని ఆఫ్ చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పాడు.

ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చాం. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్ లు ఫిక్స్ చేశాం. అందులో 17 హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. ఆ 17 హార్డ్ డిస్క్ లను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేశాం. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్ తో ఐడీపీఆర్(Inter- Domain Policy Routing) డేటా మొత్తాన్ని కూడ
కాల్చివేసాం. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్ట్యాప్స్.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు అన్నింటిని కూడా నాగోల్, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశాం. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేశాం. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అని ప్రణీతావు వాంగ్మూలం ఇచ్చాడు.

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్అవును మార్చి రెండో వారంలో ప్రత్యేక బృందం సిరిసిల్లలో అరెస్ట్ చేసింది.

Also read

Related posts

Share via