June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్



• పరారైన నిందితులు

• గంజాయి బ్యాగులను పోలీస్ స్టేషన్కు అప్పగించిన ఆర్టీసీ డ్రైవర్



విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్కు ఆర్టీసీబస్సు డ్రైవర్ పి.గణపతి సోమ వారం అప్పగించారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో రామభద్రాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. పెదమానాపురం వద్దకు వచ్చేసరికి బస్సులో ఎంత మంది ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది లెక్కిస్తున్న సమయంలో వారు టిక్కెట్లు తీయలేదని గమనించి నిలదీశారు. వారు వెంటనే బస్సుదిగి పారిపోయారు.

ప్రయాణికులతో కలిసి వారు తెచ్చిన బ్యాగులు తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు గమనించారు. వెంటనే బస్సును స్టేషన్ వద్ద ఆపి గంజాయిని ఆర్టీసీ డ్రైవర్ అప్పగించారు. తహసీల్దార్ సుదర్శన్, వీఆర్వో ఆధ్వర్యంలో బ్యాగులో ఉన్న గంజాయిని తూకంవేసి 14.3 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Also read

Related posts

Share via