November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

హిందూ ధర్మ పరిరక్షణకు, హిందువుల ఐక్యతకు విశ్వ హిందు పరిషత్ కృషి

– ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు.

  • – ఆగస్టు 16 నుండి మండలాల్లో వి.హెచ్.పి ఆత్మీయ సమ్మేళనాలు

– హిందూ ధర్మం కోసం ఉన్నాం, మా జోలికి వస్తే తాటతీస్తాం.

– భైరవేశ్వరానంద స్వామి హెచ్చరిక.

ఒంగోలు::

హిందూ ధర్మాలను, హిందూ గ్రంథాలను గత పాలకులు పూర్తిగా నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రముఖ తిరుమల తిరుపతి ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా భక్తులకు కల్పించాల్సిన అన్ని రకాల సదుపాయాలను కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా తగ్గించి వేస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అందించే అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదం కూడా నాసిరకంగా అందించి, కలియుగ వైకుంఠంగా బాసిల్లిన తిరుమల వైభవాన్ని కాలరాచే విధంగా చేసిన పాలకుల దుర్నీతిని ఖండిస్తూ ఉన్నామని, తిరుమల లోని లోటుపాట్లను సవరించి సరి చేయని యెడల ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని విశ్వహిందూ పరిషత్ ఒంగోలు శాఖ ధర్మచార్య సంయుక్త ప్రముఖ్ భైరవేశ్వరానంద స్వామి తెలిపారు. తిరుమలలో శారదా పీఠం స్వరూపానంద వారికి కేటాయించిన 5000 గజాల స్థలం లో కాకుండా ప్రక్కన ఉన్న 5000 గజాల స్థలాన్ని కబ్జా చేసి స్వామివారి ఆలయము కంటే ఎత్తుగా ఐదు అంతస్తుల పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగిందని, ఇచ్చిన అనుమతులను సైతం ఉల్లంఘించడం క్షంతవ్యం కాదంటూ… మీ భవంతిని మీరే కూలగొట్ట వలసినదిగా శారదా పీఠం స్వామికి విజ్ఞప్తి చేశారు. పీఠాలను సైతం అడ్డగోలుగా లీజ్ కి ఇవ్వడం లాడ్జీల్లా అద్దెలకు ఇవ్వడం మహా దారుణంగా పేర్కొంటూ… మేము హిందూ ధర్మం కోసమే ఉన్నాము మా జోలికి వస్తే తాటతీస్తాం అని హెచ్చరించారు. ఈ విషయాలన్నింటినీ ఈవో గారికి తెలపడం జరిగిందని వారు త్వరలో అన్నిటిని సరి చేస్తానని మాట ఇచ్చారని, వారు తిరుమలకు పునర్వైభవాన్ని తెస్తారన్న నమ్మకం మాకుఋఉన్నదని భైరవేశ్వరానంద స్వామి తెలిపారు.

ఆదివారం విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనం నందు జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు మాట్లాడుతూ వచ్చే గోకులాష్టమికి విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమాజంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి హిందువులలో చైతన్యాన్ని ఉద్దీపన చెందించడానికి ప్రతి మండలంలో మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా పరిధిలలో అవసరమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పటిష్టమైన సంఘటిత శక్తిని పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 16 నుండి రెండు వారాలపాటు ఆయా మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి హిందూ బంధువులందరినీ ఏకీకృతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా హిందూ ధార్మిక గ్రంథాలైన రామాయణ, భారత భాగవతాలను, పురాణ ఇతిహాసాలను ప్రజా జీవనంలోకి తీసుకువెళ్లడంలో దేవాదాయశాఖ విఫలమైనది. కావున హిందువుల ఐక్యమత్యం కొరకు ప్రతి గడపగడపకు వీటిని చేర్చడానికి విశ్వ హిందు పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఆగస్టు 17, 18 తేదీల్లో మల్లవరంలో ప్రాంత సత్సంగ వర్గ నిర్వహించడం జరుగుతుందని వర్గకు రాయలసీమ కోస్తా జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు.

Also read :తెలుగు రాష్ట్రాల్లో మతాల,కులాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు వైసిపి భారీ కుట్ర…!!!

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఈనమనమెళ్లూరి సీతారామయ్య, సహకార్యదర్శి ఈమని బలరాం, గడ్డం శ్రీనివాసులు విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వర్లు సాధు శ్రీనివాస గుప్తా తదితర బాధ్యులు మరియు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యకర్తలు, మాతృమూర్తులు పాల్గొన్నారు.

Also read :కుమారునికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య

మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి సవిత

Related posts

Share via