SGSTV NEWS
Andhra PradeshCrime

Visakhapatnam: ఆమె ఆగ్రహానికి 14 వాహనాలు బుగ్గి



ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని ఓ యువతి ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ కోపంతో అతడి బైక్ కు నిప్పు పెట్టింది. ప్రమాదవశాత్తు మరికొన్ని ద్విచక్ర వాహనాలూ కాలి బూడిదయ్యాయి.

విశాఖపట్నం (జగదాంబకూడలి) ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని ఓ యువతి ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ కోపంతో అతడి బైక్ కు నిప్పు పెట్టింది. ప్రమాదవశాత్తు మరికొన్ని ద్విచక్ర వాహనాలూ కాలి బూడిదయ్యాయి. విశాఖపట్నంలోని బర్మా క్యాంపునకు చెందిన యువతి (27), డాబా గార్డెన్స్ విశ్వనాథం రోడ్డు ప్రాంతంలో ఉంటున్న వ్యక్తిని మూడేళ్ల నుంచి ఇష్టపడుతోంది. రెండేళ్ల కిందటే అతడు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అతడిపై ప్రేమించిన యువతి కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 29న తెల్లవారుజాము సదరు యువకుడు ఉంటున్న అపార్టుమెంట్ వద్దకు వెళ్లి.. సెల్లార్లోని అతడి బైక్ కు నిప్పు పెట్టింది. మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరో 13 వాహనాలూ దగ్ధమయ్యాయి. భవనం ఎదుట నిలిపిన మరో 4 బైక్ లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఓ ఫ్లాట్లోని గృహోపకరణాలు కాలిపోయాయి. మొదట గుర్తుతెలియని ఆకతాయి చేసిన పనిగా భావించిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి నిందితురాలిని గుర్తించారు. అరెస్టు చేసి విచారిస్తే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురా రిమాండ్ కు తరలించినట్లు రెండో పట్టణ సీఐ ఎర్రన్నాయుడు తెలిపారు.

Also read

Related posts

Share this