March 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Viral Video: డిగ్రీ విద్యార్థినులతో ప్రిన్సిపల్ హోళీ.. ఎత్తుకుని అసభ్యంగా తాకుతూ దారుణం: వీడియో


హోళీ సందర్భంగా ఏపీలో ఓ ప్రిన్సిపల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. కదిరి అమృతవల్లి డిగ్రీ కాలేజీ అమ్మాయిలను ఎత్తుకుని బురదలో పడేశాడు వెంకటపతి. కొందరిని బ్యాడ్ టచ్ చేశాడు. వీడియో వైరల్ అవుతుండగా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

ఎత్తుకెళ్లి బురదలో పడేసి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో వెంకటపతి ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే హోళీ సందర్భంగా కాలేజీలో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిలతో కాసేపు ఆడిపాడిన వెంకటపతి.. అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు. యువతులపై పైపుతో నీళ్లు పడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు



మరికొందరిని అక్కడక్కడ తాకుతూ ఎంజాయ్ చేశాడు. అందులోంచి ఒక అమ్మాయిని ఏకంగా ఎత్తుకెళ్లి పక్కన నిలిచిన బురదలో ఎత్తేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ వెంకటపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. జగిత్యాల జిల్లా పొలాసలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. అయితే తన భర్త కమాలకర్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాని.. మరో పెళ్లి కూడా చేసుకున్నామని ఆమె ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు ప్రతిరోజూ తమకు చిత్రహింసలు పెడుతున్నడని.. అందుకే ఆయనపై పెట్రో పోసి నిప్పంటించినట్లు చెప్పింది

Also read

Related posts

Share via