April 4, 2025
SGSTV NEWS
CrimeViral

VIRAL VIDEO: కూతురివా రాక్షసివా?.. తల్లిని ఇంతలా ఏడిపిస్తారా? హార్ట్ బ్రేకింగ్ వీడియో!


హర్యానా యువతి తన తల్లిని చిత్రహింసలు పెట్టిన వీడియో వైరల్‌ అవుతోంది. అందులో తన తల్లిని చేతులతో కొట్టింది. కాళ్లతో తన్నింది. నోటితో కొరికింది. కోడకేసి బాదింది. ఆ తల్లి వద్దు వద్దు అని వేడుకున్నా కనికరికించలేదు. కనీసం కొట్టడం ఆపలేదు

తల్లి ప్రేమకు మించిన మరొక ప్రేమ ఎక్కడా దొరకదు. తొమ్మిది నెలలు మోస్తుంది అమ్మ. ఇంట్లో జీతం తీసుకోకుండా పనిచేస్తుంది అమ్మ. కన్న బిడ్డల కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది అమ్మ. ఏది కావాలంటే అది వండి పెడుతుంది అమ్మ. ఇన్ని చేసిన తల్లిని మాత్రం బిడ్డలు అతి క్రూరంగా హింసిస్తున్నారు.

తల్లి ప్రేమను మరిచి వారినే ఏడిపిస్తున్నారు. కంటనీరు తుడవాల్సిన బిడ్డలు.. దారుణంగా వారిని చిత్రహింసలు పెట్టి కన్నీరు తెప్పిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. చిన్ననాటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిని ఓ కూతురు నానా ఇబ్బందులు పెట్టింది.

చేతులతో కొట్టి, కాళ్లతో తన్ని, నోటితో కొరికి అతి హీనాతి హీనంగా తల్లితో ప్రవర్తించింది. వద్దు వద్దూ అని ఆ తల్లి ఎంత వేడుకున్నా.. కూతురు కనకరించలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


కన్నీరు తెప్పిస్తున్న వీడియో
హర్యానాలో జరిగిన ఈ ఘటన నెటిజన్ల గుండెల్ని పిండేస్తుంది. ఒక మహిళ తన తల్లి పట్ల అతి ఘోరంగా ప్రవర్తించింది. ముద్దు పెట్టాల్సిన చెంపపై.. బుగ్గలు వాచేలా కొట్టింది. జుట్టుకు మసాజ్ చేసి జాగ్రత్తగా చూసుకోవలసింది పోయి.. జుట్టు పట్టుకుని లాగింది. ముద్దులాడాల్సింది పోయి.. పళ్లతో తల్లి శరీరంపై కొరికింది.

కాళ్లకు మొక్కాల్సింది పోయి.. తన కాళ్లతో తల్లిని తన్నింది. మంచి మాటలు చెప్పాల్సిన కూతురు.. తల్లిపై అసభ్య పదజాలంతో తిట్లు తిట్టింది. ఇక ఆ తల్లి ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంది. వద్దు వద్దూ కూతురా.. అని వేడుకున్నా ఆమె కనికరించలేదు. కనీసం కొట్టడాన్ని ఆపలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఆ కూతురిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Also read

Related posts

Share via