Vikarabad : నేను, మా చెల్లి.. వద్దు డాడీ చంపొద్దు అంటూ ఎంత అరిచినా వినలేదు.. నేను ఎలా తప్పించుకున్నా అంటే..? అసలేం జరిగిందో చెప్పిన పెద్ద కుమార్తె అపర్ణ
Vikarabad : వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద యాదయ్య తన భార్య, కుమార్తె, వదిన (భార్య అక్క)ను కత్తితో గొంతుకోసం హత్య చేశాడు.ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్య భార్య అలవేలుపై నిత్యం అనుమానం వ్యక్తంచేస్తూ గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో.. ఇద్దరిని రాజీ చేసేందుకు హన్మమ్మ (అలవేలు అక్క) వచ్చింది. దీంతో శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి తరువాత యాదయ్య భార్య, వదిన, చిన్న కుమార్తెను గొంతుకోసి అత్యచేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నేను, మా చెల్లి.. వద్దు డాడీ చంపొద్దు అని ఎంత అరిచినా వినలేదు : పెద్ద కుమార్తె అపర్ణ
మా నాన్న, అమ్మ మధ్య ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. మా అమ్మను బాగా కొడతాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. మా నాన్న యాదయ్య రాత్రి మొదట పెద్దమ్మపై కొడవలితో దాడి చేశాడు. అడ్డువచ్చిన అమ్మపై కూడా దాడి చేశాడు. నేను, మా చెల్లి.. వద్దు డాడీ చంపొద్దు అని ఎంత అరిచినా వినలేదు. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అంటూ నాపై, మా చెల్లిపై కూడా కొడవలితో దాడి చేశాడు. నేను తప్పించుకొని బయటకు వచ్చా. మా ఇంటి పక్కనే ఉండే ప్రభు అంకుల్ను పిలిచా.. అతన్ని తీసుకొని వెళ్లే వరకు మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అపర్ణ తెలిపింది.
మా నాన్న మాతో బాగానే ఉండేవాడు. కానీ, మా అమ్మను మంచిగా చూసుకోకపోతుండే. ఇంతకుముందు కూడా గొడవలు జరిగాయి. కొన్ని రోజులు మేము అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నాం. మళ్లీ ఇంటికి వచ్చాము.. అయినా మా నాన్న మారలేదు. మా నాన్న ఇలా చేస్తాడు అనుకోలేదు.
ఇదిలాఉంటే.. ఘటన స్థలికి చేరుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. హత్యలకు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also read
- విశ్వకర్మ బీమా అమలు చేయాలి
- Andhra: జాతకం చెప్పే వేలిముద్రలు.. రైల్వేస్టేషన్లో తెల్లవారుజామున 4గంటలకు ఒక్కసారిగా అలజడి..
- సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని బాలుని హత్య
- Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..
- చిన్నారిపై లైంగిక దాడికి యత్నం





