విజయవాడ: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. విజయవాడ వాంబేకాలనీలోని ఏ బ్లాక్ ఘటన చోటు చేసుకుంది. గంజాయి కేసులో నిందితుడుగా ఉన్న దోమల సంగీతరావు వాంబేకాలనీ జీ ప్లస్ -3 అపార్ట్ మెంట్ ఏ బ్లాక్ లో నివాసం ఉంటున్నాడు. గంజాయి కేసులో విచారణ చేసేందుకు నున్న గ్రామీణ పోలీసులు మధ్యాహ్నం సంగీతరావు ఇంటికి వచ్చారు. పోలీసులు నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు భవనంపై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నున్న గ్రామీణ పోలీసులే సంగీత రావుని భవనంపై నుంచి తోసేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పునకు అతన్ని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!