ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళ్తండగా మృత్యువు రూపంలో వచ్చిన కారు ఏఎస్ఐ ప్రాణాలను బలిగొంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన హైదరాబ్ టు విజయవాడ హైవేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
హైవేకి ఆనుకుని ఉన్న సడక్ రోడ్డు వద్ద అధికారులు పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆ ప్రదేశంలోనే రోడ్డు దాటుతుండగా సీపీఎస్లో పనిచేస్తున్న ఏఎస్ఐ రమణ మీదకు కారు దూసుకుపోయింది. దీంతో ఏఎస్ఐ రమణ తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటన స్థలంలో ఉన్న మిగతా పోలీసులు స్పందించి హుటహుటాని రమణను విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read .
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025