June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Latest NewsLok Sabha 2024

AP Election 2024: జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ.. షర్మిలకు మద్దతు ప్రకటన.. వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలకు  ముందు సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు

కడప: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలకు () ముందు సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు. ‘‘ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. వైఎస్సార్ బిడ్డను గెలిపించి పార్లమెంట్‌కి పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’’ అంటూ విజయమ్మ వీడియో విడుదల చేశారు.

దీంతో కూతురు షర్మిలకు మద్దతు ప్రకటించడం వైఎస్ జగన్‌కు విజయమ్మ బిగ్ షాకిచ్చినట్టు అయ్యింది. అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా వైయస్ విజయమ్మ వీడియో విడుదల చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్న తల్లే జగన్‌ను నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి.

Also read

Related posts

Share via