SGSTV NEWS online
SpiritualTelangana

హైదరాబాద్ : ఇదెక్కడి వింత.. పాలు తాగుతున్న అమ్మవారు.. ఎక్కడంటే…

భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మియాపూర్‎లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మియాపూర్‎లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయం మొత్తం పోచమ్మతల్లి నామస్మరణతో మార్మోగిపోయింది. దేవాలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. చెంచాలతో పాలు తీసుకుని అమ్మవారి నోటి వద్ద ఉంచితే వాటిని తాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలసినట్లు చెబుతున్నారు ఆలయ పూజారి నవీన్. ఈ వింతైన ఘటన గురించి గత మూడు రోజుల క్రితం కమిటీకి తెలుపగా వారు కూడా అమ్మవారికి పాలను నైవేధ్యంగా సమర్పించినట్లు తెలిపారు. శుక్రవారం అమ్మవారికి చాలా పవిత్రమైన, ప్రత్యేకమైన రోజుగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకోవడంతో అమ్మవారిపట్ల మరింత భక్తిభావంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అరుదైన ఘటనలు ఇటీవలి కాలంలో చాలా చోట్ల చోటు చేసుకున్నాయి.

Also read

Related posts