• హనీట్రాప్ సుడిలో స్టూడియో యజమాని
• యువతి సహా ముగ్గురిపై కేసు
శివాజీనగర: సిలికాన్ సిటీలో మరో హనీట్రాప్ దందా బయటకు వచ్చింది. సినిమా నిర్మిద్దామని నమ్మించి ఓ వ్యాపారి నుంచి సుమారు రూ. 40 లక్షలను తీసుకొని, అతనిని హనీట్రాప్ చేసిందో ముఠా. బాధితుడు హైగ్రౌండ్స్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావ్య, దిలీప్, రవికుమార్ అనేవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గణేశ్కు ఎంజీ రోడ్డులో ఆర్ట్ స్టూడియో ఉంది. ఓ సోషల్ మీడియా యాప్లో కావ్య పరిచయం అయ్యారు. ఈమె గత నాలుగు పంవత్సరాల క్రితం సినిమా చేస్తున్నట్లు చెప్పింది. దర్శకుడు ఎస్.ఆర్.పాటిల్ అని, సినిమా కోసం రూ. 4.25 లక్షలు కావాలని గణేశ్ నుంచి తీసుకుంది
డబ్బు తిరిగి ఇవ్వమంటే..
డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే, కావ్య గొట్టిగెరె వద్దకు గణేశు పిలిపించి సన్నిహితంగా గడిపి వీడియోలు తీసుకుంది. ఆ తరువాత వీడియోలు చూపించి కేసు పెడతానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపుకు గురి చేసింది. గణేశ్ ద్వారా ఓ స్కూటర్ను కొనిపించుకుంది. బెదిరించి బంగారు గొలుసు, బ్రాస్లెట్ను తీసుకుంది. దశలవారీగా తనను రూ. 40 లక్షల వరకు లూటీ చేసినట్లు, మిగతావారు ఆమెకు సహకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..