శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై అనేక అవతారములు ఎత్తాడు. ఈ దశావతారాలలో ఐదవది వామనావతారము. ఈ అవతారమును విష్ణువు బలి చక్రవర్తిని అంతమొందించేదుకు ఎత్తాడు. బలిచక్రవర్తి ప్లహ్లాదుని మనువడు. వైరోచనుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేశ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై అనేక అవతారములు ఎత్తాడు. ఈ దశావతారాలలో ఐదవది వామనావతారము. ఈ అవతారమును విష్ణువు బలి చక్రవర్తిని అంతమొందించేదుకు ఎత్తాడు. బలిచక్రవర్తి ప్లహ్లాదుని మనువడు. వైరోచనుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేయుట ద్వారా, బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తివంతుడే ఇంద్రునిపై దండెత్తి, ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. దేవతల తల్లి అయిన అదితి, తన భర్తయైన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి తన పుత్రుల దీనస్థితిని వివరించింది.
అవుతావని బలిని శపించి వెళ్ళిపోతాడు.
అంతట బలి చక్రవర్తి వామనుని పాదాలు కడిగి, ఆ నీరును తల మీద చల్లుకుంటాడు. వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదగా వామనుని చేతిలోకి నీళ్ళు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భ పుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు. దానం స్వీకరించిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంత ఆక్రమించి ఒక పాదము భూమి మీద వేసి, రెండవ పాదము ఆకాశమ్మీద వేసి, మూడో పాదం ఎక్కడ వెయ్యాలని బలిని అడుగుతాడు.
అప్పుడు బలి ‘నా నెత్తి మీద వెయ్యి’ అంటాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధ:పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే శుభప్రదం.