వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం
తిరుపతి, ద్వారకా తిరుమల తరువాత అతి ముఖ్యమైన వెంకటేశ్వరస్వామి పుణ్య క్షేత్రం వాడపల్లిలోని వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. వాడపల్లి, కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం. 1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. 1700 వ సంవత్సరానికి ముందు వెంకటేశ్వర స్వామి ఆలయం గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండటం కారణంగా కోతకు గురి అయ్యి నదిలో మునిగి పోయింది
పూర్వం సనక, సనందనాది ఇద్దరు మహర్షులు ఉండే వారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణునికి దర్శించారు. కలియుగంలో ధర్మం ఒంటి పాదంతో మరియు కామక్రోధాలను వశులై, కలి ప్రభావంతో ధర్మబద్ధమైన జీవితం కొనసాగిస్తారు. అందువలన ప్రజలు ధర్మం వైపు నడిపించడానికి దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమీ గోదావరి వాడపల్లిలో అవతారంలో వస్తారు స్వామి వారు. మహర్షులు అందరు నాసికా త్రయంబకం వద్ద ( గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ లో) తపస్సు చేసుకుంటున్నారు) వేంకటేశ్వర స్వామి వారు మహర్షుల తపస్సుకు అనుగ్రహించి కొయ్య లక్ష్మి సహితంగా (ఎర్ర చందనము) అవతారంలో దర్శనం ఇచ్చారు. శ్రీ స్వామి వారికి నిత్యం పూజ చేస్తూ ఉండగా స్వామి వారి అజ్ఞమేర గౌతమీ ప్రవాహ మార్గం వదిలిన ఒక చందన వృక్ష పేటికలో వాడపల్లి క్షేత్రం చేరుకుని నా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు అని తెలిపారు. కొంత కాలం తర్వాత గౌతమీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం వాడపల్లి గ్రామస్థులకు కనిపించింది. గ్రామస్తులందరూ శ్రీవారి యొక్క లీలగా కనుగొనలేక పోయినా, వెంకటేశ్వర స్వామి భక్తుడైన బ్రాహ్మణునకు కలలో కనిపించి కలికల్మషం వల్ల మీరు నన్ను కనిపెట్టలేక పోతున్నారు . కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో గోదావరి నది గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ వాలిన చోట నేనున్నా (స్వామి వారు) చందన పేటిక దొరుకుతుందని సందేశం ఇచ్చారు స్వామి వారు. గ్రామస్తులందరూ శ్రీవారి యొక్క ఆదేశాన్ని పాటించి నౌకలో గోదావరి నది గర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభించింది. దానిని తీరమునకు తీసుకు వచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించిన అందులో చక్ర గదాదారుడై లక్ష్మీ శంఖ, సహితుడైన విగ్రహం దర్శనం ఇచ్చింది.
ఇది అంత జరిగిన తర్వాత దేవర్షి నారదుడు వచ్చారు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని కాపాడం కోసం విష్ణువును ప్రార్ధించడం,నారదుడు పుర జనులకు శ్రీ మహా విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలయిన ముఖ్యమైన విషయాలు వివరించెను. అందులకు శ్రీ స్వామి వారు కటి ఉన్నా హస్తమునకు బదులుగా గదాధారుడై వెలయుట జరిగినది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింపజేసినాడు. వాడపల్లి ఉన్నా శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి భక్తులకు కలుగుతుంది
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహణ కోసం 275 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు .శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం విశాలమైన ప్రాంగణంలో అభివృద్ధి చేశారు ‘గోవిందనామాలు దేవాలయం చుట్టూ పై కప్పు పై ముద్రించారు. ప్రతి శనివారం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి 40,000 నుండి 45,000 వేల భక్తులు శ్రీ వారిని దర్శించడానికి వస్తారు ఆలయానికి 1 కి.మీ పొడవున దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఈ క్షేత్రంలో ఒక్క ప్రాముఖ్యత ఉంది.
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత (Vadapalli Sri Venkateswara Swamy Temple Significance)
7 శనివారాలు పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న, 11 ప్రదక్షిణలు చేసిన భక్తుల కోరికలు నెరవేరుస్తారు భక్తులు నమ్ముతారు. ఈ కారణం చేత శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎర్ర చందన కొయ్య స్వయంభూ వెలసిన విగ్రహం. ప్రతి సంవత్సరం అంగరంగవైభవంగా పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అవివాహితులకు గోదా దేవి కళ్యాణం నిర్వహిస్తే వివాహం జరిగే అవకాశం ఉంటుంది.
Vadapalli Sri Venkateswara Swamy Temple Address
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చిరునామా:
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వాడపల్లి గ్రామం, ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ – 5332375
వాడపల్లి రావులపాలెం నుంచి 11 కి. మీ ల దూరంలో కలదు.
(By Train):
ఆలయానికి దగ్గర రాజమండ్రి రైల్వే స్టేషన్ 26.7 కి. మీ ల దూరంలో కలదు.
విమాన మార్గం (By Air):
రాజమండ్రి జాతీయ విమానాశ్రయం, 52.9 మీ ల దూరంలో కలదు.