June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

రూ.500 కోసం ఇద్దరి హత్య.నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష

రూ.500 కోసం ఇద్దరిని హత్యచేసిన ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన వరికుప్పల శ్రీనివాసు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు.

 

 

 

నిజామాబాద్ , : రూ.500 కోసం ఇద్దరిని హత్యచేసిన ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన వరికుప్పల శ్రీనివాస కు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేల్పూర్ గ్రామానికి చెందిన నాగుల అనిల్ తన తల్లి రాజుబాయితో కలిసి బతుకుదెరువుకు మామిడిపల్లికి వచ్చారు. అక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. ఓ రోజు శ్రీనివాస్ వద్ద అనిల్ రూ.500 అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో 2021 నవంబరులో ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో గొడవ పడిన రోజు రాత్రి శ్రీనివాస్ గొడ్డలి తీసుకొని అనిల్ ఇంట్లోకి వెళ్లి అతడిని నరికి చంపాడు. అడ్డు వచ్చిన అనిల్ తల్లి రాజుబాయిని కూడా హతమార్చి పారిపోయాడు. తెల్లవారుజామున స్థానికులు గమనించి అనిల్ బంధువులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన బంధువులు జరిగిన విషయం తెలుసుకొని శ్రీనివాస్పై అనుమానం ఉందని ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. పోలీసుల తరఫున పి.పి.రవిరాజ్ వాదించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా జడ్జి పైవిధంగా తీర్పును ఇచ్చారు.

Related posts

Share via