నంద్యాల జిల్లా దుద్యాల, , మత్తడి పోస్తున్న చెరువు అలుగు గుంతలో పడి ఇద్దరు బాలికలు. మృతిచెందిన విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం అల్లిఖాన్పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దసరా పండగ సందర్భంగా గ్రామానికి చెందిన ఊదరి రాములు, లక్ష్మి దంపతుల కుమార్తె ప్రణతి(14), కొత్తపల్లి, పాండు, ఆరుణ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె రుక్షిత(13) తోపాటు మరికొందరు చిన్నారులు కలిసి మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చింతల్ చెరువుకు వెళ్లారు. అడుకుంటున్న సమయంలో అలుగు పక్కనున్న గుంతలో రుక్షిత పడిపోయింది. గమనించిన ప్రణతి ఆమెను పైకి లాగబోయి తానూ పడిపోయింది. వారిని నందిని అనే మరో బాలిక గమనించి రక్షించే ప్రయత్నం చేసింది. ఆమె కూడా నీటిలో పడటంతో ముగ్గురూ ఒకరినొకరు పట్టుకొన్నారు. చుట్టుపక్కల వారు గమనించి పక్కనే దుస్తులు ఉతుకుతున్న మహిళల వద్ద నుంచి చీర తీసుకొని గుంతలోకి విసిరారు. నందిని దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరింది.
మిగిలిన ఇద్దరూ మునిగిపోయారు. తరువాత బాలికల కుటుంబసభ్యులు వచ్చి వారిని వెలికితీశారు. రుక్షిత అప్పటికే మృతిచెందగా.. కొనఊపిరితో ఉన్న ప్రణతిని కోస్గిలోని ఓ అసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై
యాదగిరి తెలిపారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





