కమలాపూర్ గ్రామ శివారులోని రాంపూర్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికుల కథనం ప్రకారం..
భూపాలపల్లి: కమలాపూర్ గ్రామ శివారులోని రాంపూర్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికుల కథనం ప్రకారం.. రేగళ్ల నరేష్(30), రేగళ్ల ప్రమోద్(25), సిద్దూ అనే మరొక యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై రాంపూర్ గ్రామం వైపు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. నరేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమోదన్ను చికిత్స నిమిత్తం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సిద్దూ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు నరేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025