పుట్టిన వెంటనే శిశువు మరణించింది. డాక్టర్లు నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే ఇందుకు కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆదివారం జరిగింది. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన పసుపునీతి మౌనిక డెలివరీ కోసం ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. కొద్దిసేపటి తర్వాత నార్మల్ డెలివరీ జరుగగా మగ శిశువు జన్మించింది. శిశువు పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే ఆక్సిజన్ పెట్టాలని, కరీంనగర్‌లోని మాత శిశు కేంద్రం తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. కరీంనగర్ హాస్పిటల్‌కు వెళ్లలోగానే శిశువు చనిపోయింది. అయితే సుల్తానాబాద్ హాస్పిటల్ డాక్టర్లు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించడం వల్లే శిశువు చనిపోయిందంటూ మౌనిక భర్త ప్రశాంత్‌తో పాటు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ హాస్పిటల్ వద్దకు వచ్చి వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ రమాదేవి మాట్లాడుతూ డెలివరీ టైంలో పేషంట్ సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించడం వల్లే శిశువు చనిపోయందనడం నిజం కాదన్నారు.
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం